ETV Bharat / lifestyle

వ్యాయామం చేయకుండా.. ఆహారంతో.. బరువు తగ్గొచ్చా! - ఆహారంతో బరువు తగ్గొచ్చా

యాభై ఏళ్లు దాటిన మహిళలు బరువు ఎక్కువగా ఉంటే.. ఆయాసం, మోకాళ్ల నొప్పులతో బాధపడుతుంటారు. వ్యాయామాలు చేసి బరువు తగ్గించుకోవడానికి వారి శరీరం, వయస్సు రెండూ సహకరించవు.. ఇలాంటి వారు.. బరువు ఎలా తగ్గించుకోవడమెలాగో చెబుతున్నారు ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ జానకీ శ్రీనాథ్.

వ్యాయామం చేయకుండా.. ఆహారంతో.. బరువు తగ్గొచ్చా!

author img

By

Published : Sep 26, 2020, 12:08 AM IST

ఆహారపుటలవాట్లలో మార్పులు చేసుకోవడం ద్వారా మీరు బరువు తగ్గొచ్ఛు అయితే వయసు పెరుగుతోంది కాబట్టి నిపుణుల సలహాతో మాత్రమే మీరు ఈ పని చేయాల్సి ఉంటుంది. వారు మీ ఆరోగ్య స్థితి, శరీర పరిస్థితి ఆధారంగా తగిన సూచనలిస్తారు. వాస్తవానికి మీరు ఉండాల్సిన బరువుకంటే ఎక్కువ ఉన్నారు. ఆ భారం కాళ్లపై పడుతుండటంతో నడవలేకపోతున్నారు. అయితే ఇలా నడవకుండా, వ్యాయమాలు కూడా చేయకుండా ఉంటే కొన్నాళ్లకు కండరాల పటుత్వం, శక్తి తగ్గిపోతాయి.

మీరేం చేయాలంటే... నిపుణుల సాయంతో ముందుగా విటమిన్‌-డి, బి12 పరీక్షలు చేయించుకోవాలి. దానికి తగ్గట్లు... విటమిన్‌ మాత్రలు వాడటం మొదలుపెట్టాలి. ఆపై వ్యాయామం చేయాలి. అధిక బరువుతో కసరత్తులు కష్టం అనుకుంటే... స్ట్రెచ్‌ బ్యాండ్‌ సాయంతో ప్రయత్నించండి. బరువు పెంచడంలోనే కాదు...తగ్గించడంలోనూ ఆహారం పాత్ర కీలకం. మాంసకృత్తులు, పీచు, విటమిన్లు, మినరళ్లు, తగిన మోతాదులో కొవ్వులు, క్యాల్షియం, జింక్‌... వంటివన్నీ శరీరానికి అవసరం. అయితే, తక్కువ కెలొరీలుండే ఆహార పదార్థాల్లో ఇవన్నీ ఉండేలా కూర్పు చేసుకోవాలి.

ఆహారపు అలవాట్లు, ఆరోగ్యం వంటివన్నీ దృష్టిలో పెట్టుకుని పోషకాహార నిపుణుల సలహాతో ఓ ఆరోగ్యకరమైన ఆహార పట్టికను తయారుచేసుకోవాలి. ముఖ్యంగా రోజువారీ తీసుకునే ఆహారంలో దాదాపు 300 - 500 కెలొరీలు తగ్గించుకోవాలి. మీ ఆహారంలో మాంసకృత్తుల వినియోగం పెరగాలి. ఇందుకోసం గుడ్డు, డబుల్‌ టోన్డ్‌ పాలు, పెరుగు, సోయా నగ్గెట్స్‌, పొట్టుతో ఉన్న పప్పు దినుసులు, పండ్లు వంటివన్నీ చేర్చుకోవాలి. ఏమైనా సమస్యలు ఎదురైతే వారు ఆహార పట్టికలో మార్పులు చేస్తారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.