చిన్నారుల్లో ఊపిరితిత్తులు ఇన్‌ఫెక్షన్‌కు గురికాకుండా రక్షణ కల్పించే ‘న్యూమోకోకల్’ వ్యాక్సిన్ త్వరలో రాష్ట్రంలో పిల్లలందరికీ అందుబాటులోకి రాబోతుంది. వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వం నుంచి రానున్న ఈ వ్యాక్సిన్‌ను ఏడాదిలోపు పిల్లలకు రెండు, మూడుసార్లు వేయనున్నారు. ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరడంవల్ల ఏటా ప్రపంచ వ్యాప్తంగా 8 లక్షల మంది 5 సంవత్సరాల్లోపు వయసు ఉన్న చిన్నారులు చనిపోతున్నారు. భారతదేశంలో ప్రతి వెయ్యి మంది చిన్నారుల్లో 37 మంది మృత్యువాత పడుతున్నారు.
రాష్ట్రంలో 2019-20లో ఐదేళ్ల వయసులోపు చిన్నారుల్లో 12,520 న్యూమోనియా కేసులు నమోదయ్యాయి. వీటిని నియంత్రించేందుకు కేసుల సంఖ్య ఆధారంగా ఎంపికచేసిన రాష్ట్రాలకు కేంద్రం న్యూమోకోకల్ వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తోంది. ‘న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఇవ్వడంవల్ల పిల్లలకు రక్షణ ఏర్పడుతుంది. 5 సంవత్సరాల్లోపు ఉన్న వారికి ఈ వ్యాక్సిన్ ఇవ్వొచ్చు. ప్రస్తుతానికి కేంద్రం ఏడాది పిల్లలకే పరిమితం చేసింది. ఈ వ్యాక్సిన్‌కు కొవిడ్ టీకాకు సంబంధం లేదు’ అని విజయవాడ ప్రభుత్వాసుపత్రి చిన్నపిల్లల వైద్యుడు ప్రొఫెసర్ రెహ్మాన్ తెలిపారు.
ఇదీ చదవండి: