ETV Bharat / jagte-raho

భర్త ఇంటి ముందు భార్య ఆందోళన.. ఎందుకంటే..?

author img

By

Published : Mar 6, 2020, 7:17 PM IST

భర్త ఇంటి ఎదుట ఏడు నెలల గర్భవతి అయిన భార్య ఆందోళనకు దిగింది. తన భర్త ఎక్కడున్నాడో చూపించమని అతని తల్లిదండ్రులను ప్రాథేయపడుతోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న తమను భర్త తరఫు వారు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపిస్తోంది. చిత్తూరు జిల్లా పలమనేరులో జరిగిన ఘటన వివరాలివి..!

wife protest infront of husband home for her husband in chittoor dst palamaneru

భర్త ఇంటి ముందు భార్య ఆందోళన

చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణం ఎంసీఆర్ నగర్​కు చెందిన ఓ మహిళ తన అత్తింటి ముందే ఆందోళనకు దిగింది. తన భర్తకు అత్తింటి వారు రెండో పెళ్లి చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించింది. తాము రెండేళ్ల పాటు ప్రేమించుకొని 2018 నవంబర్​లో పెద్దలకు ఇష్టం లేకుండా ఓ గుడిలో వివాహం చేసుకున్నామని తెలిపింది. ప్రస్తుతం తాను ఏడు నెలల గర్భవతినని.. తన భర్త కిషోర్​ తల్లిదండ్రుల మాట విని తనకు దూరంగా ఉంటున్నాడని వాపోయింది. రెండు రోజులుగా కిషోర్​ కనబడకపోవడం వల్ల ఆరా తీయగా రెండో పెళ్లి విషయం తెలిసిందని పేర్కొంది. తనకు న్యాయం చేయాలని అత్తింటి ముందే బైఠాయించింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బాధిత మహిళకు సద్దిచెప్పారు. రెండో పెళ్లి చట్టరీత్యా నేరమని.. అలా చేస్తే కిషోర్​ తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి

పోలీసుస్టేషన్​ పైనుంచి దూకిన మాజీ సర్పంచ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.