ETV Bharat / jagte-raho

తెలంగాణ:పెళ్లి చేసుకుంటానని చెప్పి చంపేశాడు! - గొర్రెకుంట బావి ఘటన హత్యల కేసు నిందితుడు సంజయ్​ కుమార్​

తెలంగాణ రాష్ట్రం వరంగల్​ గ్రామీణ జిల్లా గొర్రెకుంటలో బావిలో మృతదేహాల కేసును 6 బృందాలతో ఛేదించామని వరంగల్​ సీపీ రవీందర్​ తెలిపారు. హైదరాబాద్‌ నుంచి వచ్చిన ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేపట్టామన్నారు. నిందితుడు సంజయ్​.. బిహార్​లోని నుర్లపూర్​కు చెందిన వ్యక్తిగా తెలిపారు. ప్రస్తుతం జాన్​పాకలో నివాసం ఉంటున్నట్లు పేర్కొన్నారు.

తెలంగాణ  :పెళ్లి చేసుకుంటానని చెప్పి చంపేశాడు..

author img

By

Published : May 25, 2020, 7:57 PM IST

పెళ్లి చేసుకుంటానని చెప్పి చంపేశాడు..

మక్సూద్‌కు ఐదారేళ్ల క్రితం సంజయ్‌ పరిచయమయ్యాడు. ముగ్గురు పిల్లలతో మక్సూద్‌ సోదరి కూతురు రఫిక బంగాల్‌ నుంచి వరంగల్‌కు ఉపాధి కోసం వచ్చింది. సంజయ్‌కుమార్ ఒంటరిగా ఉండేవాడు. సంజయ్‌కుమార్‌ వద్ద డబ్బులు తీసుకుని రఫిక భోజనం పెట్టేది. రఫిక, సంజయ్‌కుమార్‌ మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. రఫిక కుమార్తెతో కూడా సంజయ్‌కుమార్ సన్నిహితంగా ఉన్నాడు. ఈ విషయమై సంజయ్‌కుమార్‌తో పలుమార్లు రఫిక గొడవపడింది. రఫికను వివాహం చేసుకుంటానని సంజయ్‌ నమ్మించాడు. ఆ తర్వాత కూడా ఆమె కుమార్తెతో సన్నిహితంగా ఉన్నాడు.

-రవీందర్​, వరంగల్​ సీపీ

సంజయ్‌ ప్రవర్తనలో మార్పు రాకపోవడం వల్ల పోలీసులకు రఫిక ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. రఫికను అడ్డుతొలగించుకునేందుకు సంజయ్‌ నిర్ణయించుకున్నాడు. పెళ్లి విషయాన్ని బంధువులతో చర్చించేందుకు బంగాల్‌ వెళ్దామని నమ్మించాడు. మార్చి 6న గరీబ్‌ రథ్‌ రైలులో రాత్రి 10 గం.కు రఫికను తీసుకుని బయలుదేరాడు. రైలులోనే రఫికకు నిద్రమాత్రలు కలిపిన మజ్జిగను అందించాడు. మజ్జిగ తాగిన రఫిక మత్తులోకి జారుకోగానే చున్నీతో గొంతు బిగించి చంపాడు. ఆ తర్వాత నిడదవోలు వద్ద రైలు నుంచి తోసేశాడు.

-రవీందర్​, వరంగల్​ సీపీ

పెళ్లి చేసుకుంటానని చెప్పి చంపేశాడు..

--

ఇవీ చూడండి:

విదేశాల నుంచి తెలంగాణకు వచ్చేవారికి నూతన మార్గదర్శకాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.