ETV Bharat / jagte-raho

మావోల ఘాతుకం... తెరాస కార్యకర్త దారుణ హత్య - etv bharat

తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు మళ్లీ పెరిగినట్టు కనిపిస్తోంది. తాజాగా ములుగు జిల్లా వెంకటాపురం మండలం భోదాపురంలో తెరాస కార్యకర్తను మావోయిస్టులు హత్య చేశారు. మాడూరి భీమేశ్వర్‌రావు(48)ను శనివారం అర్ధరాత్రి కాల్చి చంపారు. ఇంటికి వెళ్లిన మావోలు భీమేశ్వర్‌రావును హత్య చేశారు. ఘటనా స్థలిలో లేఖను వదిలివెళ్లారు.

trs activist murdered
trs activist murdered
author img

By

Published : Oct 11, 2020, 8:50 AM IST

Updated : Oct 11, 2020, 9:58 AM IST

తెలంగాణ.. ములుగు జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. వెంకటాపురం మండలం భోదాపురంలో తెరాస కార్యకర్తను కత్తులతో పొడిచి చంపారు. అర్ధరాత్రి సమయంలో మావోయిస్టులు ఇంట్లోకి చొరబడి మాడూరి భీమేశ్వర్‌(48)ను హత్య చేశారు. కుటుంబ సభ్యులు ఎంత బతిమాలినా పట్టించుకోకుండా కత్తులతో పొడిచి భీమేశ్వర్‌ను హతమార్చారు. అనంతరం ఘటనా స్థలంలో లేఖను వదిలి వెళ్లారు. ఈ ఘటన ములుగు జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మావోయిస్టుల కోసం గాలింపు ముమ్మరం చేశారు.

పార్టీ ఫండ్‌ ఇవ్వనందుకే హత్య: ఎస్పీ
సామాన్య ప్రజలపై మావోయిస్టులు హత్యాకాండ కొనసాగిస్తున్నారని ములుగు ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పలుమార్లు మావోయిస్టులు భీమేశ్వర్‌ను పార్టీ ఫండ్‌ అడిగారని, డబ్బులు ఇవ్వకపోవడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఎస్పీ తెలిపారు. ఆరుగురు మావోయిస్టులు భీమేశ్వర్‌ ఇంట్లోకి చొరబడి హత్యచేశారని వెల్లడించారు. డబ్బు ఇవ్వని సామాన్య ప్రజలను ఇన్‌ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు హతమారుస్తున్నారని పేర్కొన్నారు. గిరిజనులను అభివృద్ధి కార్యక్రమాలకు దూరం చేస్తున్నారన్నారు.

ఇదీ చదవండి: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. మూడు రోజుల పాటు వర్షాలు

Last Updated : Oct 11, 2020, 9:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.