జనగామ జిల్లాలో మాజీ కౌన్సిలర్, తెదేపా నేత పులిస్వామి దారుణ హత్యకు గురయ్యారు. గురువారం ఉదయం వాకింగ్ చేస్తున్న పులిస్వామిని వరంగల్-హైదరాబాద్ రహదారిలో గల సోషల్ వెల్ఫేర్ స్కూల్ వద్ద ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మారణాయుధాలతో అతి కిరాతకంగా కొట్టి చంపారు.
కోర్టులో ఉన్న భూవివాదం కేసులో బుధవారం రోజున పులిస్వామికి అనుకూలంగా తీర్పు రావడం వల్ల హత్యకు అదే కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అతి త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఏసీపీ వినోద్ కుమార్ తెలిపారు.
- ఇదీ చూడండి : విశాఖలో.. విద్యుత్ ఏఈ ఇంట్లో అనిశా సోదాలు