అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణ పోలీసులు ఆదివారం ముగ్గురు దొంగలను అరెస్ట్ చేసి.. వారి నుంచి 18 విద్యుత్ మోటార్లను రికవరీ చేశారు. ధర్మవరం గుట్టకిందపల్లి కాలనీకి చెందిన శ్రీశైలం గణేష్, సత్యసాయినగర్కు చెందిన పుట్లూరు చంద్రశేఖర్, కొత్తపేటకు చెందిన పామీశెట్టి నరసింహులు చేనేత వృత్తి చేస్తూ జీవనం సాగించేవారు.
కరోనా లాక్డౌన్తో ఆరు నెలలుగా పనుల్లేక...జల్సాలకు అలవాటుపడి పట్టణంలో ఇళ్ల నిర్మాణం చేసే ప్రాంతాల్లో నీటి మోటార్లను చోరీ చేస్తూ... వాటిని తక్కువ ధరకే విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పట్టణంలో వరుసగా చోరీలు జరుగుతుండటంతో ఫిర్యాదులు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు చోరులను అరెస్ట్ చేసి... వారి వద్ద నుంచి రూ.రెండు లక్షల విలువచేసే 18 మోటార్లను రికవరీ చేసినట్లు డీఎస్పీ రమాకాంత్ తెలిపారు. ముగ్గురు నిందితులను కోర్టులో హాజరుపరచగా... వారికి న్యాయస్థానం రిమాండ్కు ఆదేశించింది.
ఇదీ చదవండి: శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత