తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని బ్రిడ్జి వద్ద ఉన్న బిట్టు ఆటోమొబైల్స్ షాపులో చోరీ జరిగింది. ఈరోజు ఉదయం కౌంటర్లో ఉన్న డబ్బు తీసుకుందామని యజమాని శ్రీనివాస్ షాపు తెరవగా... శబ్దం వచ్చింది. ఎలుకల వల్ల శబ్దం వచ్చిందనుకుని కౌంటర్ తెరిచాడు. అందులో గతరాత్రి పెట్టిన లక్షా యాభైవేల రూపాయలు కనిపించకపోయేసరికి ఖంగుతిన్నాడు.
షాపు వెనుకనుంచి శబ్దం వస్తోందని చూడగా... ఓ వ్యక్తి అక్కణ్నుంచి పరారవుతూ కనిపించాడు. అతన్ని వెంబడించినా ఫలితం లేకపోయిందని శ్రీనివాస్ పోలీసులను ఆశ్రయించాడు. షాపులోని నగదుతో పాటు సీసీ కెమెరానూ ఎత్తుకెళ్లాడని ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటనాస్థలంలో వేలి ముద్రలు సేకరించారు. కేసు నమోదు చేశారు.
ఇవీ చూడండి: