చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం, శ్రీనివాసమంగాపురం సమీపంలో ఎర్రచందనం డంప్‌ను టాస్క్ ఫోర్స్ అధికారులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. శ్రీవారిమెట్టు వెనుకవైపు సచ్చినోడిబండ, అన్నదమ్ముల కోన, జొన్నరాసికుప్ప ప్రాంతాల నుంచి దుంగలను మోసుకొచ్చి శ్రీనివాసమంగాపురం సమీపంలో డంప్ చేసుకున్నారు స్మగ్లర్లు. సంఘటన స్థలానికి చేరుకున్న టాస్క్ ఫోర్స్ ఎస్పీ ఆంజనేయులు మాట్లాడుతూ.. లాక్డౌన్ తర్వాత స్మగ్లర్లు బరితెగిస్తున్నారని అన్నారు. జన సంచారం గల ప్రాంతాల్లో లోడింగ్ పాయింట్స్ పెట్టుకోవడం సాహసోపేతమైన నిర్ణయమని తెలిపారు. కొందరు స్థానికులు స్మగ్లర్లకు షెల్టర్లు ఇస్తున్నట్లు సమాచారం అందిందని.. వారిపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. సంఘటన స్థలాంలో 49 దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పరారైన స్మగ్లర్ల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి :