బాలుడిని విడిచిపెట్టేందుకు రూ.45 లక్షలు డిమాండ్ చేశారని ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించారు. అదేరోజు సాయంత్రం 5 గంటలకు మహబూబాబాద్ శివారులోని గుట్టలపైకి తీసుకెళ్లాడని తెలిపారు. కిడ్నాప్ చేసిన గంట తర్వాత బాలుడిని గొంతు పిసికి చంపేశారని పేర్కొన్నారు. మంద సాగర్ అనే వ్యక్తి దీక్షిత్‌రెడ్డి ఇంటి సమీపంలోనే ఉంటాడని చెప్పారు. అతనికి సీసీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయో తెలుసని వివరించారు. సీసీ కెమెరాలకు దొరకకుండా బాలుడిని కిడ్నాప్ చేయాలనుకున్నాడని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నిందితుడిని పట్టుకున్నాట్లు ఎస్పీ తెలిపారు.
ఇంటర్నెట్ కాల్స్ చేసినా హైదరాబాద్ సైబర్ క్రైమ్ టాస్క్‌ఫోర్స్ సాయంతో ఛేదించామన్నారు. బాలుడిని కిడ్నాప్ చేసిన సీసీ కెమెరాల దృశ్యాలు సేకరించామని తెలిపారు. చంపిన తర్వాత కూడా రెండ్రోజులపాటు ఫోన్లు చేస్తూనే ఉన్నారని... ఎస్పీ చెప్పారు. బాలుడిని కిడ్నాప్ చేసింది.. గుట్టల వద్దకు తీసుకెళ్లింది.. చంపింది ఒక్కడేనని స్పష్టం చేశారు. సాయంత్రం లేదా శుక్రవారం ఉదయం మరిన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు. ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న మనోజ్‌రెడ్డి కూడా తమ అదుపులోనే ఉన్నట్లు తెలిపారు. ఇతని పాత్రపై విచారణ జరుపుతున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: తెలంగాణ: మహబూబాబాద్‌లో అపహరణకు గురైన బాలుడు హత్య