పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ ఎస్సై మోసం చేశాడంటూ... తెలంగాణలోని హన్మకొండ సుబేదారి పోలీస్స్టేషన్లో ఓ యువతి ఫిర్యాదు చేసింది. కొద్ది నెలల కింద... వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సుబేదారి పోలీస్స్టేషన్లో విధులు నిర్వహించిన ఎస్సై... తనను పలుమార్లు గదికి పిలిపించుకుని చనువుగా ఉండేవాడని తెలిపింది. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి... మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం సదరు ఎస్సై.... వరంగల్ పోలీస్ కమిషనరేట్లో పని చేయడం లేదని తెలిసింది. బదిలీపై వేరే జిల్లాకు వెళ్లినట్టు సమాచారం.
ఇదీ చూడండి: