అతి వేగంతో ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసిపోగా... మరో రెండు ప్రాణాలు ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. వరంగల్ అర్బన్ జిల్లా హసన్‌పర్తి చెరువుకట్ట వద్ద లారీ, ఆటో ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురు ఆక్కడిక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
ఓవర్‌టేక్ చేయబోయి
అనంతసాగర్ నుంచి నలుగురు ప్రయాణికులతో ఆటో హన్మకొండకు బయలుదేరగా... ఓ లారీ వరంగల్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తోంది. హసన్‌పర్తి చెరువు కట్ట వద్ద ఒకదానికొకటి వేగంగా ఢీకొన్నాయి. ఆటో ముందున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. మృతుల్లో బావుపేటకు చెందిన మర్రి శ్రీకాంత్, శాంతమ్మ, వర్ధన్నపేటకు చెందిన శ్రావణి ఉన్నారు.
బావుపేటకు చెందిన అరుణ్, హసన్‌పర్తికి చెందిన శీలం నవ్య తీవ్రంగా గాయపడగా... వీరిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని వరంగల్ నగర పోలీస్ కమిషనర్ రవీందర్ పరిశీలించారు.
ఇదీ చూడండి: