ETV Bharat / jagte-raho

వేధింపులు, మోసం.. శ్రావణి బలవన్మరణానికి ఇదే కారణం! - Tv actress shravani suicide news

పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ప్రేమికుడు చివరికి నిరాకరించడం... నటనలో అవకాశాల పేరుతో దగ్గరైన వాళ్లు వేధించడం... బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్యకు కారణాలయ్యాయి. కలకలం సృష్టిస్తున్న ఈ కేసులో శ్రావణితో ప్రేమాయణం కొనసాగించిన దేవరాజుతో పాటు ఆమెతో సన్నిహితంగా మెలిగిన సాయికృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు, సినీ నిర్మాత అశోక్ రెడ్డి పరారీలో ఉన్నారు.

police
police
author img

By

Published : Sep 15, 2020, 10:29 AM IST

ఆ ముగ్గురి వల్లనే... బుల్లితెర నటి శ్రావణి కేసు ఛేదించిన పోలీసులు

రోజుకో మలుపు తిరుగుతున్న బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసును పోలీసులు ఛేదించారు. వేధించడం, మోసం చేయడం వల్ల మనస్తాపానికి గురైన శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తేల్చారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ గొల్లప్రోలుకు చెందిన శ్రావణి... సీరియల్‌లో నటించడానికి హైదరాబాద్‌కు వచ్చి... కుటుంబంతో కలిసి మధురానగర్‌లో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో సాయికృష్ణారెడ్డితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.

సన్నిహితంగానే..

ఆ తర్వాత సినీ నిర్మాత అశోక్‌రెడ్డితోనూ శ్రావణి సన్నిహితంగా మెలిగింది. ఇదే క్రమంలో ఏడాది క్రితం టిక్‌టాక్ ద్వారా శ్రావణికి దేవరాజ్ రెడ్డి పరిచయమయ్యాడు. వీరిద్దరూ పెళ్లిచేసుకోవాలని భావించారు. శ్రావణికి వేరేవారితో సంబంధం ఉన్నట్లు గుర్తించిన దేవరాజ్‌... ఆమెను దూరంగా ఉంచాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

ఇద్దరిపై దాడి...

కొద్దిరోజులు దూరంగా ఉన్న శ్రావణి, దేవరాజ్ ఫోన్లో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఈనెల 7న శ్రావణి, దేవరాజ్‌ రెస్టారెంట్లో ఉన్న విషయం తెలుసుకున్న సాయికృష్ణారెడ్డి అక్కడికి వెళ్లి దేవరాజుపై దాడికి దిగాడు. అడ్డుకోబోయిన శ్రావణిపైనా చేయిచేసుకొని ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు.

వాళ్లు నిందితులు కాదు..

విషయం ఆమె తల్లిదండ్రులకు తెలియజేయగా... వారు శ్రావణిని తీవ్రంగా మందలించారు. ఇదే విషయాన్ని శ్రావణి.. దేవరాజ్‌కు తెలిపినా స్పందించకపోవడం వల్ల మనస్తాపానికి గురై ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు వెల్లడించారు. ఇందులో శ్రావణి తల్లిదండ్రులను నిందితులుగా చేర్చడం కుదరదని డీసీపీ తెలిపారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న సాయికృష్ణారెడ్డి, దేవరాజురెడ్డిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో నిందితుడు, నిర్మాత అశోక్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇదీ చూడండి:

గోరేటి వెంకన్న ఇంటికి వెళ్లిన రేణూ దేశాయ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.