గుంటూరు జిల్లా వడ్లముడి గ్రామనికి చెందిన బండి దుర్గ ప్రసాద్ టైల్స్ పని చేస్తూ జీవిస్తున్నాడు. రోజు లాగానే టైల్స్ మేస్త్రీ భాజీతో పాటు కూలీ పని నిమిత్తం గుంటూరు చైతన్య పురి కాలనీ, మూడో లైన్ నందు అపార్ట్మెంట్లో పని చేస్తున్న క్రమంలో ప్రమాదవ శాత్తు టైల్స్ కటింగ్ మెషిన్ వైర్ జాయింట్ తగలడంతో షాక్ కొట్టింది.
అప్పటికే..
వెంటనే బాధితుడ్ని హుటాహుటిన గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
భార్య సమాచారం మేరకు..
తోటి కార్మికుల సమాచారం మేరకు ప్రసాద్ భార్య నాగమణి గుంటూరు అరుండల్పేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి : బాల్య వివాహం చేసిన తల్లిదండ్రులు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన చిన్నారి