ETV Bharat / jagte-raho

మాఫియాపై పోరాడుతున్నందుకే.. నాపై కేసులు! - RAVIPRAKASH enquiry

ఫోర్జరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్​ను.. తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేశారు. దాదాపు 5 గంటల పాటు ప్రశ్నించి.. బుధవారం మళ్లీ విచారణకు హాజరుకావాలని నోటీసు ఇచ్చారు.

raviprakash
author img

By

Published : Jun 4, 2019, 11:21 PM IST

ఐదు గంటలపాటు విచారణ

తెలంగాణ సైబర్​క్రైం పోలీసుల ఎదుట.. టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాశ్ విచారణకు హాజరయ్యారు. ఆయనను పోలీసులు దాదాపు 5 గంటల పాటు ప్రశ్నించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రవిప్రకాశ్.. తనను అన్యాయంగా మూడు కేసుల్లో ఇరికించినట్లు ఆరోపించారు. మాఫియా శక్తులు కావాలనే తనపై కేసులు పెట్టి వేధించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ​తనకు మద్దతుగా నిలిచిన వారందరికి రవిప్రకాశ్​ కృతజ్ఞతలు తెలిపారు. రేపు ఉదయం 11 గంటలకు మరోసారి విచారణకు హాజరు కావాల్సిందిగా రవిప్రకాశ్​కు నోటీసులిచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

ఇవీ చూడండి: కారుకు ఎదురులేదు... ఫలితాలు ఏకపక్షం

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.