నాలుగు ఏళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. తన అన్న పెళ్లి తర్వాత చేసుకుంటానని మాట ఇచ్చాడు. తర్వాత ముఖం చాటేశాడు. చేసేది లేక తెలంగాణలోని బిక్కనూర్ మండల కేంద్రానికి చెందిన ఓ యువతి కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం అంతంపల్లి గ్రామంలో ప్రియుడి ఇంటి ముందు ధర్నా చేపట్టింది.
"పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి పూర్తిగా వాడుకున్నాడు. గర్భవతిని చేసి... అబార్షన్ చేయించాడు. పెళ్లి చేసుకోవాలని నిలదీయగా తన అన్న పెళ్లి అయిన తర్వాత అని నమ్మించి తప్పించుకుంటూ తిరిగాడు. ఎన్నిసార్లు వేడుకున్నా పట్టించుకోలేదు. కులాలు వేరుగా ఉన్నాయి, పెళ్లి చేసుకోవద్దని వారి కుటుంబ సభ్యులు బెదిరించారు."
-బాధితురాలు
మోసపోయానని గ్రహించిన బాధిత యువతి ఎస్పీ శ్వేతకు ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టింది. న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తానని పేర్కొంది.
ఇదీ చదవండి: