ఓ సీరియల్ హీరో సమీర్ అలియాస్ అమర్... తమను అసభ్య పదజాలంతో దూషిస్తూ లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడని.... రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో శ్రీవిద్య అనే యువతి ఫిర్యాదు చేసింది. మణికొండలో ఉంటున్న శ్రీవిద్య, రష్మీ దీప్తి, లక్ష్మీ కలిసి మణికొండలో బొటిక్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. కొన్ని కారణాలవల్ల రష్మీ దీప్తి బొటిక్ వ్యాపారం నుంచి తప్పుకుంది.
రష్మీ దీప్తికి రావాల్సిన కొన్ని వస్తువులు తీసుకెళ్లేందుకు నిన్న రాత్రి సీరియల్ హీరో సమీర్‌తో పాటు పలువురు స్నేహితులు శ్రీవిద్య ఇంటికి వెళ్లారు. అక్కడ మాట మాట పెరిగి అది కాస్త గొడవకు దారి తీసింది. ఈ విషయమై ఒకరిపై ఒకరు రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బొటిక్ వద్ద, అపార్ట్మెంట్వాసులను విచారించి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని రాయదుర్గం సీఐ... రవీందర్ స్ఫష్టం చేశారు.