ETV Bharat / jagte-raho

రుణ యాప్‌ల కేసుల్లో కీలక సూత్రధారి అరెస్టు

రుణ యాప్‌ల అక్రమదందా డొంక కదులుతోంది. దిల్లీలో చైనాకు చెందిన ప్రధాన సూత్రధారుడిని అరెస్టు చేసిన హైదరాబాద్‌ పోలీసులు.. ఇప్పటివరకు యాప్‌ల ద్వారా 21 వేల కోట్ల వ్యాపారాన్ని జరిగినట్లు గుర్తించారు. బిట్‌ కాయిన్ల రూపంలో ఈ నగదును విదేశాలకు బదిలీ చేసినట్టు వెల్లడైంది. భారత్‌కు చెందిన వ్యవహారాలు చూస్తున్న మరో చైనా దేశస్థుడి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.

hyderabad
hyderabad
author img

By

Published : Dec 31, 2020, 10:16 AM IST

ఆన్‌లైన్‌ రుణాల యాప్‌ల కేసులో తవ్వే కొద్దీ కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. బాధితుల ఫిర్యాదుతో కేసులు నమోదుచేసిన హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు 15 రోజుల దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయి. చైనా దేశస్తులు వెనుక ఉండి నడిపిస్తున్న ఈ రుణదందాలో.... ఆరునెలల్లోనే 1.4కోట్ల లావాదేవీల ద్వారా 21వేల కోట్ల వ్యాపారం చేసినట్లు గుర్తించారు. ఇప్పటివరకు సుమారు 150 పైగా రుణ యాప్‌లను నిర్వహిస్తున్నట్టుగా పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

దిల్లీలో అరెస్టు చేసిన పోలీసులు

రుణాల యాప్‌ల రూపకల్పన, కాల్‌ సెంటర్ల నిర్వహణలో అన్నీ తానై వ్యవహరించిన చైనాకు చెందిన చూ వుయ్‌ అలియాస్‌ లాంబోను దిల్లీలో అరెస్టు చేశారు. దిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించిన లాంబోను విమానాశ్రయంలో షాంఘై వెళ్లే విమానం ఎక్కేలోపు హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. లాంబోను హైదరాబాద్‌ తీసుకువచ్చి విచారిస్తున్నారు. అగ్లో టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, లీ యూ ఫాంగ్ టెక్నాలజీ, నాబ్లూమ్‌ టెక్నాలజీ, పిన్‌ప్రింట్ టెక్నాలజీ కంపెనీలను నడుపుతున్న లాంబో... కర్నూలుకు చెందిన నాగరాజును కాల్‌సెంటర్‌ నిర్వాహకుడిగా నియమించుకున్నాడు. దేశవ్యాప్తంగా ఉన్న కాల్‌సెంటర్లకు ఇతనే కీలకంగా వ్యవహరించినట్టు పోలీసుల విచారణలో బయటపడింది. హైదరాబాద్‌తో పాటు పలు మెట్రో నగరాల్లోనూ కాల్‌సెంటర్ల ద్వారా వేధింపులకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. భారత్‌లో యాప్‌ల వ్యవహారం చూస్తున్న మరో చైనా వాసి యువాన్‌ కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఇతను చైనాలోని బీజింగ్‌లో ఉన్నట్టు అనుమానిస్తున్నారు.

బిట్​ కాయిన్ల ద్వారా..

మూడు కమిషనరేట్ల పరిధిలో ఇప్పటి వరకు 29 మందిని రుణ యాప్‌ల కేసులో పోలీసులు అరెస్టు చేశారు. ఖాతాల్లో ఉన్న కోట్ల నగదును స్తంభింపజేశారు. తెలుగు రాష్ట్రాల్లో యాప్‌ల ద్వారా రుణాలిస్తున్న చైనా కంపెనీలు బాధితుల నుంచి రోజుకు 10 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేస్తున్నట్లు సైబర్‌క్రైం పోలీసులకు ఆధారాలు లభించాయి. ఈ నగదును ముందు ఈ-వ్యాలెట్లలోకి బదిలీ చేసుకుని అంతరం 340వర్చువల్‌ ఖాతాల్లోకి డిపాజిట్‌ చేస్తున్నారు. ఆ తర్వాత వేర్వేరు కంపెనీల ఖాతాలు, వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించడంతో పాటు బిట్‌కాయిన్ల ద్వారా విదేశాలకు మళ్లిస్తున్నట్లు గుర్తించారు.

ఇదీ చదవండి: నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు.. హద్దు దాటితే చర్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.