ETV Bharat / jagte-raho

కామాంధుడు... మనవరాలినీ వదల్లేదు

వరసకు తాత.. ఆ చిన్నారికి తెలియదు వాడిలో ఓ కామాంధుడు దాగి ఉన్నాడని. తాతే కదా అని దగ్గరకు వెళ్లింది. ఆ వ్యక్తి మనవరాలని తెలిసి కూడా లైంగిక వాంఛ తీర్చుకున్నాడు.

author img

By

Published : Aug 18, 2019, 7:53 PM IST

కామాంధుడు... మనవరాలినీ వదల్లేదు
కామాంధుడు... మనవరాలినీ వదల్లేదు

తెలంగాణలోని వరంగల్‌ జిల్లాలో తొమ్మిది నెలల చిన్నారిపై జరిగిన ఘోరాన్ని మరవకముందే.. అదే రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో మరో దారుణం జరిగింది. ఓ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలికపై వరసకు తాత అయిన విశ్రాంత ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పలుమార్లు బలవంతంగా లైంగిక వేధింపులకు పాల్పడడం వల్ల బాలిక గర్భం దాల్చింది. సభ్య సమాజమే సిగ్గుతో తలదించుకునేలా జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

అసలేం జరిగిందంటే...

పదో తరగతి చదువుతున్న బాలిక గర్భవతిగా వెలుగు చూడటం జగిత్యాలలో సంచలనం కలిగించింది. పట్టణానికి చెందిన ఓ బాలిక జిల్లాలోని కస్తూర్బా పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. వేసవి సెలవుల కోసం ఇంటికి వచ్చిన ఆమెపై వరసకు తాతైన 65 ఏళ్ల విశ్రాంత ఉపాధ్యాయుడు కన్నేశాడు. బాలికను లొంగదీసుకుని లైంగికవాంఛ తీర్చుకున్నాడు. ఇటీవల తరచూ అస్వస్థతకు గురికావటం వల్ల కంగారుపడిన తల్లితండ్రులు జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో అమ్మాయికి వైద్యపరీక్షలు చేయించారు. నాలుగు నెలల గర్భవతిగా తేలడంతో హతాశులయ్యారు. అమ్మాయిని ఆరా తీయగా తాత అసలు రూపం బయటపడింది.

రివర్స్​ డ్రామా ప్లే చేసిన తాత

ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని బంధువులు, కుటుంబ సభ్యులు సదరు వృద్ధుడిని పిలిచి విషయం అడిగారు. ఆ కామాంధుడు మాత్రం తనకు ఏమీ తెలియదని బుకాయించాడు. పైగా తనకు ప్రాణభయం ఉందని పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ఇంటికి వెళ్లి విచారించగా అసలు విషయం బయటపడింది. శనివారం రాత్రి బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

కఠిన చర్యలు తీసుకోవాలి

ఇంతటి దారుణానికి ఒడిగట్టిన నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని బాలిక తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఇదీ చూడండి:

పురివిప్పి ఆడిన నెమళ్లు.. వర్షాలపై ప్రజల ఆశలు

Intro:Contributor Anil
Center Tungaturthi
Dist Suryapet.
సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం ఆర్వ పల్లి గ్రామంలో సుప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ పునరుద్ధరణ పనులకు గ్రహణం వీడింది .
సుమారు నాలుగు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కల్గిన ఈ ఆలయం శిథిలావస్థకు చేరడంతో 2013 లో దేవాలయం పునర్నిర్మాణానికి భక్తులు కొందరు ఎనిమిది లక్షలు రూపాయలు విరాళాలు సేకరించారు . దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు 32 లక్షలు మంజూరు చేశారు. మొదటగా సీసీ తో పనులు ప్రారంభించారు, భక్తుల కోరిక మేరకు విరాళాలు సేకరించి గర్భగుడి, మండపం,అర్ద మండపాన్ని రాతితో నిర్మించిన డానికి నిర్ణయించారు. గర్భగుడి మండపం స్లాబ్ నిర్మాణం కొరకు పనులు పూర్తి చేశారు, ఆ తర్వాత నిధుల కొరతతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి, ప్రస్తుతం నిధులు మంజూరు కావడంతో దేవాలయం పునర్నిర్మాణ పనులకు టెండర్ ప్రక్రియ పూర్తయింది. వారం పది రోజులు పనులు మొదలు పెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
జాజిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన దివంగత నీటిపారుదల శాఖ రాష్ట్ర ముఖ్య సలహాదారుడు రామరాజు విద్యాసాగర్ రావు దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించారు .
ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు స్పందించిన సీఎం ప్రత్యేక నిధులు కోటి రూపాయలు మంజూరు చేశారు. వీటికి తోడు CGF నిధులు కూడా మరో 20 లక్షలతో కలిపి గర్భాలయ గోపురం 2 ఉపాలయాలు‌ ,రాతి మండపం., విమాన గోపురం, ధ్వజస్తంభం, కోనేరు, ప్రహరి, ఆలయ రథాలయం ఇంటి నిర్మాణ పనులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం 1 కోటి 20 లక్షలు ప్రక్రియ పూర్తి చేశారు.
ఈ పనులు నటరాజ సంస్థ టెండర్ ద్వారా దక్కించుకుంది.
★ దేవాలయ పునరుద్ధరణ పనులకు మోక్షం కలిగిందని టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయిందని, వారం పది రోజుల్లో పనులు మొదలు పెడతారని గుత్తేదారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ నిర్ణీత గడువులో పనులు పూర్తి చేస్తామని ఆలయAE రాజయ్య తెలిపారు.

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.