ETV Bharat / jagte-raho

తెలంగాణ: వరంగల్​ బావి మృతదేహాల ఘటనలో వీడిన మిస్టరీ - గొర్రెకుంట బావి ఘటన వార్తలు

gorrekunta-well-bodies-mystery-revealed
gorrekunta-well-bodies-mystery-revealed
author img

By

Published : May 24, 2020, 8:05 PM IST

Updated : May 24, 2020, 9:31 PM IST

20:05 May 24

గొర్రెకుంట బావి మృతదేహాల ఘటనలో వీడిన మిస్టరీ

వరంగల్​లోని గొర్రెకుంట బావి మృతదేహాల మిస్టరీ వీడింది. 9 మంది మరణానికి బిహార్​కు చెందిన సంజయ్ కుమార్ యాదవే కారణమని... పోలీసుల విచారణలో వెల్లడైంది. కూల్ డ్రింకులో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి..మక్​సూద్ కుటుంబసభ్యులు అపస్మారక స్థితిలోకి వెళ్లాక... బావిలోకి తోసేసి హత్యచేసినట్లు సంజయ్  పోలీసుల వద్ద నేరం అంగీకరించినట్లు తెలుస్తోంది. నిందితుడిని సోమవారం మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి.  

  • ప్రేమ వ్యహారమే కారణమా?

మక్ సూద్ కుమార్తెతో ఉన్న ప్రేమ వ్యవహారం... ఇతరులతో ఆమె సన్నిహితంగా ఉంటోందన్న కసితో సంజయ్ ఈ హత్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. మక్ సూద్ కుమారుడి పుట్టిన రోజు వేడుకలకు వచ్చి... శీతలపానీయాల్లో నిద్రమాత్రలిచ్చి స్పృహ కోల్పోయిన తరువాత ఒక్కొక్కరిని బావిలో పడేసి హత్యచేసినట్లు విచారణలో తేలింది.  

  • 20 ఏళ్ల క్రితం వరంగల్​కు

పశ్చిమ్ బంగాకు చెందిన మక్ సూద్ 20 ఏళ్ల క్రితమే వరంగల్​కు వచ్చి స్థిరపడ్డాడు. గత ఏడాది డిసెంబర్​లో గొర్రకుంటలోని ఓ గోదాంలో... గన్నీ సంచులు కుట్టే పనిలో చేరాడు. నగరంలోని కరీమాబాద్​లో నివాసముంటున్న మక్ సూద్... లాక్ డౌన్ కారణంగా తాను పనిచేసే గోదాం వద్దకే మకాం మార్చాడు. వీరుండే పక్క గదిలోనే ఇద్దరు బిహార్​ యువకులు కూడా ఉంటున్నారు.  

  • మొదట నాలుగు... తర్వాత ఐదు

గురువారం సాయంత్రం... గోదాం సమీపంలోని పాడుబడిన బావిలో మక్ సూద్ అతని కుటుంబసభ్యుల నాలుగు మృతదేహాలు వెలుగుచూశాయి. మరునాడు ఇదే బావిలో 5 మృతదేహాలు కనిపించాయి. మక్ సూద్... అతని భార్య నిషా, కొడుకు సొహెల్, షాబాజ్, కుమార్త బుస్రా... మనమడితో పాటు ఇద్దరు బిహార్ యువకులు, మక్ సూద్​కు బాగా పరిచయం ఉన్న షకీల్ మృతదేహాలు కనిపించాయి. ఒక్కసారిగా 9 మంది చనిపోవడం తీవ్ర కలకలం రేపింది.  

  • ఓ ఆటో వాలా కూడా

పోలీసులు గత మూడు రోజలుగా ముమ్మర దర్యాప్తు చేశారు. పోస్ట్ మార్టం ప్రాథమిక నివేదికలో కూడా.. నీళ్లలో పడి చనిపోయారని స్పష్టంగా ఉంది. చివరకు ఫోన్ కాల్ డేటా ఆధారంగా... సంజయ్ యాదవ్, మోహన్​తోపాటు మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా నేరం అంగీకరించారు.  ఓ ఆటో వాలా కూడా సంజయ్​కు సహకరించినట్లు సమాచారం. 

Last Updated : May 24, 2020, 9:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.