కామారెడ్డి జిల్లా బాన్సువాడలో విషాదం జరిగింది. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో టీకా వికటించి నాలుగురోజుల పసికందు మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ బిడ్డ మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు.
బాన్సువాడ మండలం జక్కల్ దాని తండాకు చెందిన శ్రీనివాస్, మీనా దంపదులకు నాలుగు రోజుల క్రితం ఆడ బిడ్డ జన్మించింది. బరువు తక్కువ ఉండడం వల్ల బుధవారం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చారు. చికిత్స పొందుతూ పసికందు మృతి చెందింది.వైద్యుల నిర్లక్ష్యం వల్లనే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయిందని బంధువులు ఆరోపించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి: 'ఖాళీ సమయాల్లో ఆ ఇన్నింగ్స్ హైలైట్స్ చూస్తా'