ETV Bharat / jagte-raho

విధి నిర్వహణలో అగ్నిమాపక శకటం ఉద్యోగి మృతి - పరిశ్రమలో అగ్ని ప్రమాదం

మంటలను అదుపు చేసే క్రమంలో అగ్నిమాపక శకటం ఉద్యోగి అసువులు బాసిన విషాద ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకొంది.

fire accident in uday trade industry one died at anantapuram district
విధి నిర్వహణలో అగ్నిమాపక శకటం ఉద్యోగి మృతి
author img

By

Published : Apr 27, 2020, 7:37 AM IST

అనంతపురం జిల్లా పెనుకొండ మండలం రాంపురం గ్రామంలో నివాస గృహాలకు ఆనుకొని ఉదయ్‌ ట్రేడర్స్ అనే పరిశ్రమ వ్యర్థాల నిల్వ కేంద్రం ఉంది. అక్కడ ఒక్కసారిగా అగ్నిప్రమాదం చోటుచేసుకోగా.. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు శ్రమించారు. పుట్టపర్తి, హిందూపురం, ధర్మవరం కేంద్రాల నుంచి 5, కియా పరిశ్రమకు చెందిన మరొకటి సహా మొత్తం 6 అగ్నిమాపక శకటాలతో సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ క్రమంలో కియా పరిశ్రమ అగ్నిమాపక శకటం మేనేజర్ పరంధామన్ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ని పోలీసు వాహనంలో పెనుగొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా... అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పరంధామన్‌ భార్య బెంగళూరులో ఉపాధ్యాయినిగా పని చేస్తున్నారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు. ఎట్టకేలకు అతడి మృతదేహాన్ని బెంగళూరు తరలించారు.

ఇవీ చదవండి...కాంక్రీటు తూములో మానవ అస్థిపంజరం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.