ETV Bharat / jagte-raho

కరోనా నేపథ్యంలో చెలరేగుతున్న నకిలీగాళ్లు

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో మాస్క్‌లకు డిమాండ్‌ పెరిగింది. దీనిని ఆసరాగా చేసుకున్న వ్యాపారులు పెద్దఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. మరికొందరు అడుగు ముందుకేసి నకిలీ శానిటైజర్లు తయారు చేస్తున్నారు. ఇటీవలే నకిలీ శానిటైజర్లు తయారు చేస్తున్న కేంద్రంపై పోలీసులు దాడి చేసి ముగ్గురిని పట్టుకోగా... తాజాగా మాస్కులను పెద్ద ఎత్తున నిల్వ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు.

face-masks-in-black-market
face-masks-in-black-market
author img

By

Published : Mar 23, 2020, 8:14 AM IST

కరోనా నేపథ్యంలో చెలరేగుతున్న నకిలీగాళ్లు

ప్రజలను వణికిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తుంటే... కొందరు అక్రమార్కులు మాస్కులను భారీగా నిల్వ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇంకొందరు నకిలీ శానిటైజర్లు తయారు చేసి ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఇటీవల నకిలీ శానిటైజర్ల తయారీ కేంద్రంపై దాడి చేసిన తెలంగాణ పరిధిలోని రాచకొండ పోలీసులు.. ముగ్గురు సభ్యుల ముఠాను పట్టుకున్నారు. తాజాగా... మాస్కులు నిల్వ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్న ఓ వ్యక్తిని హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు.

జియాగూడ ఇమామ్‌పురకు చెందిన గణేష్‌ ఓహత్కర్‌.. మాస్కులు తయారు చేసి విక్రయిస్తుంటాడు. ఇతను ఒక్కో మాస్కును రెండు నుంచి మూడు రూపాయలకు తయారు చేసే వాడు. వాటిని మార్కెట్‌లో 20 రూపాయలకు విక్రయించే వాడు. వాటిని ధరలు పెంచి విక్రయిస్తున్నట్టు సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అతని ఇంటిపై దాడి చేసి పట్టుకున్నారు. ఎక్కువ ధరలకు విక్రయించడానికి సుమారు పది వేల మాస్కులను నిల్వ చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసి కేసు నమోదు చేసుకొని పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఇవీ చూడండి:

ఈనెల 31 వరకు ఇళ్ల నుంచి ఎవరూ బయటికి రావొద్దు: సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.