ETV Bharat / jagte-raho

24 గంటల్లో అరెస్ట్​... 9 రోజుల్లో ఎన్​కౌంటర్​​ - disha rape and murder case full details exclusive etv bharat story

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసుకు... పోలీసులు ముగింపు పలికారు. నవంబర్​ 27న జరిగిన ఈ ఘటనను సవాల్​గా తీసుకున్న పోలీసులు... 24 గంటల్లోనే అరెస్ట్​ చేసి 9 రోజుల్లోనే ఎన్​కౌంటర్​ చేశారు.

disha-rape-and-murder
disha-rape-and-murder
author img

By

Published : Dec 6, 2019, 9:28 AM IST

దిశ హత్య కేసుకు పోలీసులు ముగింపు పలికారు. నవంబర్‌ 27 అర్ధరాత్రి నలుగురు కిరాతకులు షాద్‌నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లి వద్ద యువ వైద్యురాలిపై అత్యాచారం చేసి సజీవ దహనం చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. పార్లమెంట్‌లోనూ దద్ధరిల్లింది. దిశ కేసులో నిందితులను తక్షణమే ఉరితీయాలనే డిమాండ్లు వెలువడ్డాయి.

సవాల్​గా తీసుకున్న పోలీసులు

దిశ కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు 24 గంటల్లోనే నిందితులను అరెస్ట్‌ చేశారు. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా నలుగురిని పట్టుకున్నారు. కిరాతకులను తక్షణమే ఉరితీయాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. చెర్లపల్లి రిమాండ్‌లో ఉన్న ఖైదీలను ఘటనా స్థలానికి తీసుకెళ్లి సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస‌్తుండగా పారిపోయేందుకు నిందిలు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. నిందితులు పారిపోతుండగా కాల్పులు జరిపినట్లు పోలీసు ఉన్నతాధికారులు నిర్ధరించారు.

హైకోర్టు అనుమతిలో ఫాస్ట్​ట్రాక్​ కోర్టు

దిశ ఘటనలో నిందితులకు కఠిన శిక్షలు విధించాలనే డిమాండ్లతో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు అనుమతితో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేసింది. నెలరోజుల్లోనే దర్యాప్తు పూర్తిచేసి కిరాతకులకు ఉరిశిక్ష పడేలా చూసేందుకు పోలీసులు దర్యాప్తును సైతం ముమ్మరం చేశారు.

నాలుగు బృందాలుగా ఏర్పడి

నాలుగు బృందాలుగా ఏర్పడి కేసులో ఆధారాలను సేకరిస్తున్నారు. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ కేసును సవాల్‌గా తీసుకుని పర్యవేక్షిస్తున్నారు. క్లూస్‌ టీంలను రంగంలోకి దింపారు. నిన్న నిందితులు ఉపయోగించిన లారీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఘటనా స్థలానికి వెళ్లిన క్లూస్‌టీంలు ఆధారాల కోసం ప్రయత్నించారు. బాధితురాలి చరవాణి కోసం వెతికారు. నిందితులు చెప్పిన వివరాల ఆధారంగా వేట ముమ్మరం చేశారు.

ఎన్​కౌంటర్​ స్పెషలిస్ట్​

సజ్జనార్‌ ఇప్పుడు ఈ పేరే మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగుతోంది. వరంగల్‌ యాసిడ్‌ దాడి ఘటనలో అప్పుడు ఎస్పీగా ఉన్న సజ్జనార్‌ నిందితులకు ఎన్‌కౌంటర్‌తో చెక్‌పెట్టారు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సజ్జనార్‌కు రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. యాసిడ్‌ దాడి నిందితులకు సరైన శిక్ష పడిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. చటాన్‌పల్లి ఘటనలోనూ సజ్జనార్‌ సైబరాబాద్‌ కమిషనర్‌గా ఉన్నారు. నేరం జరిగిన తీరు అత్యంత అమానుషంగా ఉండటంతో అందరూ సజ్జనార్‌ మరోసారి సంచలనం సృష్టిస్తారనే అంచనాకు వచ్చారు.

సోషల్​ మీడియాలోనూ

సామాజిక మాధ్యమాల్లోనూ నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయాలని గళమెత్తారు. తాజాగా ఈ కేసులోనూ నలుగురు నిందితులు ఎన్‌కౌంటర్‌ కావడం మరోసారి సజ్జనారే ఈ కేసును పర్యవేక్షిస్తుండటం గమనార్హం.

దిశను కాల్చిన చోటే..

దిశ హత్యకేసులో నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేశారు. దిశను కాల్చిన చోటే నిందితులకు ముగింపు పలికారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా కిరాతకులు పరారీకి యత్నించారు. పట్టుకునేందుకు పోలీసుల యత్నించగా.. పోలీసుల వద్ద ఆయుధాలు తీసుకుని పరారీకి యత్నించారు. ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపామని పోలీసులు వెల్లడించారు. ఎన్‌కౌంటర్‌లో మహ్మద్ ఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు నలుగురు కిరాతకులు హతమయ్యారు.

తెల్లవారుజామున నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతాన్ని సైబరాబాద్ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ పరిశీలించారు....

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.