ETV Bharat / jagte-raho

పెళ్లిలో బంధువులమంటూ తిరిగారు.. బంగారం ఎత్తుకెళ్లి ఇలా దొరికారు - Theft at a wedding in Kamareddy district

ఓ పెళ్లి జరుగుతోంది. అందులో ఓ జంట హడావుడిగా తిరిగారు. మీరు ఎవరు అని అడిగిన పెళ్లి వాళ్లకు సైతం అనుమానం రాకుండా బంధువులమంటూ చెప్పుకున్నారు. ఆ తర్వాత అదును చూసి మెల్లగా పెళ్లి కుమార్తె బంధువుల వద్ద బంగారాన్ని దొంగలించారు. గమనించిన బంధువులు వారిని పట్టుకుని చితక్కొట్టారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.

couple-who-
couple-who-
author img

By

Published : Nov 24, 2020, 4:31 PM IST

పెళ్లిలో బంధువులమంటూ తిరిగారు.. బంగారం ఎత్తుకెళ్లి ఇలా దొరికారు

తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో జరిగిన ఓ పెళ్లిలో బంధువుల రూపంలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. బంధువులు గమనించి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

అసలు దొంగతనం ఎలా జరిగిందంటే?

కామారెడ్డి అయ్యప్ప ఫంక్షన్​హాల్​లో జరిగిన పెళ్లిలో బంధువులుగా చెప్పుకుంటూ... పెళ్లి కుమార్తె బంధువులకు సంబంధించిన మూడు తులాల బంగారాన్ని దంపతులు దొంగలించారు. దీన్ని గమనించిన బంధువులు... బంగారం దొంగిలించిన వారిని పట్టుకుని చితక్కొట్టారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. బంగారాన్ని దొంగలించిన దంపతులు ఇందిరానగర్​ కాలనీకు చెందిన పరమేశ్​, యశోదలుగా గుర్తించారు.

ఇదీ చదవండి:

పురిట్లోనే చనిపోయాడని చెప్పి అమ్మేశారు.. తర్వాత ఏమైందంటే...!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.