చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం వికృతమాలలో ఓ కంపెనీలో కేబుళ్లను కత్తిరించడం ద్వారా నష్టానికి కారణమైన చైనా ఇంజినీరుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫాక్స్ లింక్స్ ఇన్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలో యంత్రాలు అమర్చేందుకు ఫాంగ్ చెంజిజ్ అనే ఇంజినీరు చైనా నుంచి వచ్చాడు. యంత్రాలు బిగించే సమయంలో వాటిలోని విలువైన కేబుళ్లను కత్తిరించినట్లు కంపెనీ నిర్వాహకులు గుర్తించారు. దీని వల్ల సంస్థకు 10 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని.. ఈ నెల 21న ఏర్పేడు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరో చైనా కంపెనీకి చెందిన ఓ వ్యక్తి ఆదేశాల మేరకే ఈ తప్పిదానికి పాల్పడినట్లు నిందితుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి : 'ఆ వెబ్సైట్లను బ్లాక్ చేయండి'... కేంద్ర మంత్రికి సీఎం జగన్ లేఖ