నెల్లూరు పట్టణ కేంద్రంలోని శాంతిలాల్ అండ్ సన్స్ జ్యూవెలర్స్ దర్గామిట్ట బ్రాంచ్లో రూ.70.13 కోట్ల రుణం తీసుకుంది. ఈ నేపథ్యంలో హామీగా ఉంచిన సొమ్ములను (స్టాకు) బ్యాంక్ అధికారులకు తెలియకుండా మళ్లించినందుకు సీబీఐ కేసు నమోదు చేసింది.
ఆధునికీకరణ ముసుగులో..
నగల దుకాణం ఆధునికీకరణ ముసుగులో తమకు హామీగా ఉంచిన సొమ్ములను అమ్మేసి, నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ కెనరా బ్యాంక్ ఏజీఎం సత్యనారాయణమూర్తి కేంద్ర దర్యాప్తు సంస్థలో ఫిర్యాదు చేశారు. ఫలితంగా సీబీఐ చెన్నై విభాగం కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది.
ఇవీ చూడండి : వివేకా హత్యకేసు: సెటిల్మెంట్లు, స్థిరాస్తి గొడవలపై సీబీఐ ఆరా