ETV Bharat / jagte-raho

'భరణం ఇప్పించమంటే.. బలత్కారానికి ఒడిగట్టాడు' - CASE FILED ON ADVOCATE

భర్తతో మనస్పర్థలున్నాయి.. భరణం ఇప్పించమని అర్ధించిన ఓ వివాహితపైనే బలత్కారానికి పాల్పడ్డాడో ప్రబుద్ధ ప్లీడరు. ఈ ఘటన తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో చోటుచేసుకుంది.

hyd_tg_54_03_case_on_advocate_av_TS10056

author img

By

Published : Feb 4, 2020, 9:49 AM IST

భర్తతో గొడవలున్నాయని... విడాకుల కోసం న్యాయవాది వద్దకెళ్తే అత్యాచారానికి ఒడిగట్టాడని ఓ మహిళా ఆరోపించింది. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం ఠాణాలో సదరు మహిళ ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం జ్యోతి నగర్​లో నివాసముండే ఓ మహిళ తన భర్త వేధిస్తున్నాడని 2003 సంవత్సరంలో ఫిర్యాదు చేసింది. అనంతరం 2007లో తనకు మెయింటినెన్స్ కావాలంటూ గతంలో పటాన్ చెరులోని న్యాయవాది రఘునందన్ రావు ద్వారా కేసు దాఖలు చేసినట్లు తెలిపింది.

మత్తు మందు కలిపాడు... అత్యాచారం చేశాడు

పటాన్ చెరులోని ఆయన కార్యాలయానికి సదరు మహిళను పిలిపించుకుని కాఫీలో మత్తు కలిపి ఇచ్చాడని పేర్కొంది. ఫలితంగా అపస్మారక స్థితికి చేరుకున్న తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదులో స్పష్టం చేసింది. ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించాడని ఆవేదన వ్యక్తం చేసింది.

హెచ్​ఆర్సీతో కదిలిన పోలీసులు...

రామచంద్రాపురం పోలీసులకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోకపోవడం వల్ల మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేశానని బాధితురాలు వెల్లడించింది. హెచ్ఆర్సీ సూచన మేరకు సైబరాబాద్ సీపీ సజ్జనార్​ను కలిస్తే రామచంద్రపురం పీఎస్​లో కేసు నమోదు చేస్తారని చెప్పి పంపారని అన్నారు. ఈ మేరకు రామచంద్రాపురం ఠాణాలో ఫిర్యాదు చేయడం వల్ల రఘునందన్ రావుపై అత్యాచారం, బెదిరింపు, బ్లాక్ మెయిల్ నేరాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

'భరణం ఇప్పించమంటే.. బలత్కారానికి ఒడిగట్టాడు'

ఇవీ చూడండి : సైనేడ్​తో భార్యను చంపిన బ్యాంకు మేనేజర్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.