తెలంగాణలోని కరీంనగర్ జిల్లా అలుగునూరు కాకతీయ కాలువలో కారు బోల్తా పడి ముగ్గురు జలసమాధి అయిన కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి సోదరి రాధికతో పాటు బావ, కోడలు వినయశ్రీ గత నెల 27న ఇంటి నుంచి కారులో బయలుదేరి వెళ్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. రేణిగుంట టోల్‌ప్లాజాలోని సీసీ ఫుటేజీని పోలీసులు సేకరించగా... జనవరి 26 న ఉదయం 11గంటలకు కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్లినట్లు దృశ్యాలు నమోదయ్యాయి. అదే రోజు రాత్రి 8:15 గంటలకు కారు కరీంనగర్‌కు తిరిగి వచ్చినట్లు దృశ్యాలు నమోదయ్యాయి. గత నెల 27న మధ్యాహ్నం 3గంటలకు తన యజమాని ఫోన్‌చేసి రీఛార్జ్ చేయించమన్నారని నర్రె సత్యనారాయణరెడ్డి ఫర్టిలైజర్ దుకాణంలో పనిచేసే గుమాస్తా నర్సింగ్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం. అదే రోజు సాయంత్రం తిరిగి హైదరాబాద్ వెళుతూ కాలువలో పడిపోయారా... లేదా మరుసటి రోజు అందులో పడిపోయారా అన్న విషయం స్పష్టత రావాల్సి ఉంది.
ఇదీ చూడండి: 3 వారాలుగా జలసమాధిలోనే ఎమ్మెల్యే సోదరి కుటుంబం!