ETV Bharat / jagte-raho

ఆటోల్లో చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్ - ఆటోలలో చోరీలకు పాల్పడుతున్న మఠా అరెస్ట్

ఆటోల్లో ప్రయాణికుల నుంచి నగదు దొంగిలిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను లాలాపేట పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 2 లక్షలు, ఓ ఆటో స్వాధీనం చేసుకున్నట్లు గుంటూరు తూర్పు మండలం డీఎస్పీ సీతారామయ్య తెలిపారు.

auto theft gang arrest at guntur
ఆటోలలో చోరీలకు పాల్పడుతున్న మఠా అరెస్ట్
author img

By

Published : Nov 28, 2020, 10:01 PM IST

గుంటూరు నగరంలో ఆటోల్లో చోరీలకు పాల్పడుతున్న మఠాను లాలాపేట పోలీసులు అరెస్టు చేశారు. ఐదుగురు సభ్యుల ముఠాలో ఓ మహిళా కూడా ఉంది. ఈ వివరాలను తూర్పు మండలం డీఎస్పీ సీతారామయ్య వెల్లడించారు. పల్లెపోగు అనిల్, దర్శనపు చరణ్, కొక్కిలిగడ్డ ప్రేంకుమార్, తెనాలి రాయప్ప, పసుపులేటి మేరి ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నారు. వీళ్లలో ఒకరు ఆటో డ్రైవర్​గా నటించి ప్రయాణికుల్ని ఎక్కించుకుంటాడు. మిగతా వారు ప్రయాణికుల మాదిరిగా ఆటో ఎక్కి అందులో ఉన్నవారి నుంచి డబ్బులు కాజేస్తారు.

ముఖ్యంగా... గుంటూరు మిర్చి యార్డు, చుట్టుగుంట, పల్నాడు బస్టాండ్ పరిసరాల్లో ఇలా ఆటోలో ఎక్కినవారు డబ్బులు పోగొట్టుకున్నట్లు 8 మంది నుంచి ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా ఆటోను గుర్తించి... ముఠా గుట్టురట్టు చేశారు. నిందితుల నుంచి రూ. 2లక్షలు, ఆటో స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ సీతారామయ్య వివరించారు.

ఇదీ చదవండి:

'అమ్మ కోసం అత్తింట్లో దొంగతనం... పట్టించిన సీసీ కెమెరాలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.