విజయనగరంలో జనసేన నేత, ఎస్సీ, ఎస్టీ సెల్ లీగల్ అడ్వైజర్ రేగు మహేశ్వర రావుపై హత్యాయత్నం జరిగింది. మహేశ్వరరావు స్వస్థలం సాలూరు పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి కారుతో ఢీ కొట్టాడు. చిన్న గాయాలతో బయటపడిన రేగు మహేశ్వరరావును స్థానికులు సాలూరు ఆస్పత్రికి తరలించారు. అనంతరం నిందితుడు సాలూరు ఠాణాలో లొంగిపోయినట్లు సమాచారం.
ఆమె ఎస్టీ కాదంటూ..
గతంలో ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీ వాణి ఎస్టీ కాదంటూ రేగు మహేశ్వరరావు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మహేశ్వర రావుపై హత్యాయత్నానికి పాల్పడటంతో ఒక్కసారిగా గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు.