విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కొత్తూరు నరసింగరావుపేట జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతి చెందారు. మండలంలోని రాజుపాలెంకు చెందిన దువ్వి లావణ్య(23).. భర్త పవన్ కుమార్ తమ ఇద్దరు పిల్లలతో కలిసి ద్విచక్ర వాహనంపై అనకాపల్లి బయల్దేరారు. ఈ క్రమంలో కొత్తూరు నరసింగరావుపేట జాతీయ రహదారిపై వెనక నుంచి లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో లావణ్య అక్కడికక్కడే మృతి చెందింది. పవన్ కుమార్కు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పిల్లలు సురక్షితంగా బయటపడినట్లు అనకాపల్లి గ్రామీణ ఎస్సై ఈశ్వరరావు తెలిపారు.
ఇదీ చూడండి: పండ్ల రసంలో విషం కలిపి భార్యను చంపిన భర్త