కుటుంబ కలహాలతో ఓ కుమారుడు తన తల్లిని కర్రతో కొట్టి చంపాడు. ఈ ఘటన వరంగల్ గ్రామీణ జిల్లా దుగ్గొండి మండలం శివాజీ నగర్లో జరిగింది. గ్రామానికి చెందిన రాజేందర్... తన తల్లి కమలాబాయితో గొడవ పడ్డాడు. కోపంలో ఆమె తలపై కర్రతో బలంగా కొట్టాడు.
తలపై తీవ్ర గాయం కావడం వల్ల ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచింది. రక్తపు మడుగులో పడి ఉన్న తల్లిని చూసి రాజేందర్ పరారయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు డాగ్స్వ్కాడ్తో తనిఖీలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: అక్రమంగా తరలిస్తున్న ఖైనీ, గుట్కా ప్యాకెట్లు పట్టివేత