ETV Bharat / jagte-raho

యూఏఈ కరెన్సీ పేరుతో మోసం - currency

నగదు మార్పిడి కేంద్రంలో జిరాక్స్‌ తీసిన నోట్లు ఇచ్చి.. చెల్లుబాటయ్యే కరెన్సీ తీసుకొని పరారైన ఘటన తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండల కేంద్రంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఓ వ్యక్తి యూఏఈ దేశానికి చెందిన 4800 నకలు దిర్హమ్స్​ ఇచ్చి....89 వేల రూపాయల నగదుతో పరారయ్యాడు .

a_man_fraud_with_uae_currency
author img

By

Published : Jul 22, 2019, 10:06 AM IST

నగదు మార్పిడి కేంద్రంలో జిరాక్స్‌ తీసిన నోట్లు ఇచ్చి చెల్లుబాటయ్యే కరెన్సీ తీసుకొని పరారైన ఘటన తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై నవీపేటలోని ‘హనుమాన్‌ మీ-సేవ’ కేంద్రానికి(ఖాతాదారుల కేంద్రం) వచ్చారు. షకీల్‌ అనే వ్యక్తి కేంద్రంలోకి వెళ్లగా తోడుగా వచ్చిన వ్యక్తి బయటే వాహనంపై ఉన్నాడు. యూఏఈ దేశానికి చెందిన 4,800 దిర్హమ్స్‌(కరెన్సీ) అసలైనవి తీసుకొచ్చి డబ్బు మార్పిడి చేసి ఇవ్వాలని(స్వదేశీ కరెన్సీ) ఆపరేటర్‌ రేఖకు అందించాడు. వాటిని ఆమె తీసుకొని పరిశీలించి రూ.88,800 వస్తాయని చెప్పారు... చాలా తక్కువ ఇస్తున్నారని ఆపరేటర్‌తో వాగ్వాదానికి దిగి ఇచ్చిన నోట్లు వాపసు తీసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత వచ్చి కనీసం రూ.89 వేలు ఇవ్వాలని కోరగా అందుకు ఆమె సమ్మతించారు. రెండోసారి వచ్చిన షకీల్‌ అసలైన దిర్హమ్స్‌ కరెన్సీకి బదులుగా వాటి నకలు నోట్లను ఓ పర్సులో పెట్టి ఇచ్చాడు. ఇది వరకు ఇచ్చిన సరైన దిర్హమ్స్‌నే సదరు వ్యక్తి మళ్లీ ఇచ్చాడని భావించిన ఆమె రూ.89 వేల నగదు ఇచ్చారు. అనంతరం నిందితుడు ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తితో కలిసి పరారయ్యాడు.

అతడు ఇచ్చిన పర్సు నుంచి డబ్బులు తీసేందుకు ఆమె ప్రయత్నించగా జిప్‌ పనిచేయలేదు. కొద్దిసేపటి తర్వాత జిప్‌ తీసి చూడగా అందులో జిరాక్స్‌ నోట్లు కనిపించాయి. ఈఘటనకు సంబంధించి కేంద్రంలోని సీసీ ఫుటేజీల్లో నిక్షిప్తమైన దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. చందు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు చెప్పారు. నవీపేటలో డబ్బు మార్పిడి చేసిన ముఠా నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.ఎక్కడికి వెళ్లినా ముఠా సభ్యులు 4,800దిర్హమ్స్‌ ఇచ్చి రూ.90 వేలు దేశీయ కరెన్సీ తీసుకొంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇవీ చూడండి;ఏమైందో..ఏమో..బండరాయితో కొట్టి చంపేశాడు!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.