ETV Bharat / jagte-raho

రక్షకుడే భక్షకుడు.. పట్టిచ్చిన సీసీ కెమెరాలు

author img

By

Published : Jul 11, 2020, 6:46 PM IST

Updated : Jul 11, 2020, 7:13 PM IST

కంపెనీకి కాపలా ఉండాల్సిన కాపాలదారుడే దొంగతనానికి పాల్పడిన ఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంషాబాద్​లో చోటుచేసుకుంది. ఐదు లక్షల 40 వేల రూపాయలను ఎత్తుకెళ్లన నిందితుడి చోరీ వ్యవహారం మొత్తం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. నిందితుడిని పట్టుకున్న పోలీసులు రూ.లక్ష 40 వేలు స్వాధీనం చేసుకున్నారు.

security guard theft
కాపలా ఉంటానన్నాడు.. అదును చూసి కాజేశాడు..

తెలంగాణ రంగారెడ్డి జిల్లా శంషాబాద్​లోని స్వస్తిక్ అస్క్ అనే ప్లాస్టిక్ కుర్చీల కంపెనీలో వారం క్రితం రూ.5 లక్షల 40 వేల నగదు చోరీకి గురైంది. వెంటనే యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా సెక్యూరిటీ గార్డే దొంగతనం చేసినట్లు గుర్తించారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.

శంషాబాద్ ఉందానగర్ రైల్వే స్టేషన్​లో సెక్యూరిటీ గార్డును అదుపులోకి తీసుకున్నట్లు సీఐ ప్రకాశ్​ రెడ్డి తెలిపారు. అతని వద్ద లక్ష 40 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. మిగతా నగదును ఏం చేశాడో దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు అసోంకు చెందినవాడిగా గుర్తించారు.

ఇదీ చూడండి:

ప్రభుత్వ వైద్యురాలి నిర్వాకం.. బాలింతరాలు మృతి

Last Updated : Jul 11, 2020, 7:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.