హైదరాబాద్ తార్నాక చౌరస్తాలోని గుడ్ల్యాండ్స్ బార్లో చోరీ జరిగింది. బార్ తలుపు గొళ్లెం విరగ్గొట్టి దుండగులు లోనికి ప్రవేశించారు. వివిధ బ్రాండ్లకు సంబంధించిన 170 మద్యం ఫుల్ బాటిళ్లను దొంగిలించారు.
మద్యం దుకాణం మిద్దెపై ఉన్న మొక్కలకు నీళ్లు పెట్టడానికి వచ్చిన యజమాని తలుపు పగులగొట్టి ఉండటం చూసి బార్ యజమాని వీరకుమార్ రెడ్డికి సమాచాారం అందించాడు. పోలీసులకు ఫిర్యాదు చేయగా... సంఘటనాస్థలికి చేరుకుని పరిశీలించగా... సీసీటీవీపై టవల్ కప్పి ఉంది. కేసు నమోదు చేసుకున్న తెలంగాణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.