ETV Bharat / international

అఫ్గాన్‌లో యుద్ధం ముగిసింది.. తాలిబన్ల ప్రకటన - తాలిబన్ల ప్రకటన

అఫ్గానిస్థాన్​లో రాజధాని కాబూల్​ను ఆక్రమించుకున్న తాలిబన్లు.. కీలక ప్రకటన చేశారు. దేశంలో యుద్ధం ముగిసిందని పేర్కొన్నారు. కొత్త పాలనపై మరికొన్ని రోజుల్లో తాలిబన్లు స్పష్టత ఇస్తారని తాలిబన్ల ప్రతినిధి వెల్లడించారు.

talibans on afgan war
'అఫ్గాన్‌లో యద్ధం ముగిసింది.. వారి త్యాగఫలాలు అందాయి'
author img

By

Published : Aug 16, 2021, 1:41 PM IST

అఫ్గానిస్థాన్‌లో యుద్ధం ముగిసిందని తాలిబన్లు ప్రకటించారు. వారు నిన్న రాజధాని కాబూల్‌ను ఆక్రమించిన విషయం తెలిసిందే. అనంతరం అధ్యక్ష భవనాన్ని అధీనంలోకి తీసుకొన్నారు. ఈ సందర్భంగా తాలిబన్‌ రాజకీయ కార్యాలయ ప్రతినిధి మహమ్మద్‌ నయీమ్‌ అల్‌జజీరా టీవీతో మాట్లాడుతూ "ఈ రోజు అఫ్గాన్‌ ప్రజలు, ముజాహిద్దీన్‌లకు చాలా గొప్పది. వారి 20 ఏళ్ల త్యాగఫలాలు నేడు అందాయి. భగవంతుడికి ధన్యవాదాలు. దేశంలో యుద్ధం ముగిసింది" అని పేర్కొన్నారు.

కొత్త పాలనపై మరికొన్ని రోజుల్లో తాలిబన్లు స్పష్టత ఇస్తారని నయీమ్‌ వెల్లడించారు. అంతేకాదు అఫ్గానిస్థాన్‌ శాంతి యుతంగా అంతర్జాతీయ సంబంధాలు కోరుకుంటోందని పేర్కొన్నారు. ఏ దేశానికి వ్యతిరేకంగా తమ భూభాగాన్ని ఎవరినీ వాడుకోనీయమని పునరుద్ఘాటించారు.

దేశ రాజధాని కాబూల్‌ స్వాధీనానికి వారికి కనీసం వారం రోజులు కూడా పట్టలేదు. అమెరికా వేల కోట్ల డాలర్లు ధారపోసి అఫ్గాన్‌ సైనికులకు ఇచ్చిన శిక్షణ మొత్తం బూడిదలో పోసిన పన్నీరైంది. వారు కనీస పోరాటం కూడా చేయకుండా రాజధానిని అప్పజెప్పారు. సోమవారం ఉదయం అమెరికా దౌత్యకార్యాలయం దీనిపై కీలక ప్రకటన చేసింది. అమెరికా రాయబారి రోస్‌ విల్సన్‌ సహా కీలక ప్రతినిధులను విమానాశ్రయానికి తరలించింది. వారిని అతి త్వరలోనే అఫ్గాన్‌ నుంచి బయటకు తీసుకెళ్లనుంది.

ఇదీ చదవండి : అఫ్గాన్ ప్రజల కళ్లముందు మెదులుతున్న క్రూర పాలన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.