Motorcycle explosion: ఇరాక్‌లో ద్విచక్రవాహనం పేలిన ఘటనలో నలుగురు మరణించగా.. మరో నలుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఇరాక్‌లోని దక్షిణాది నగరమైన బస్రాలో ఈ పేలుడు సంభవించింది. దీంతో పరిసరాల్లో దట్టమైన పొగ అలుముకుంది.
తొలుత ఈ పేలుడును కారు బాంబుగా భావించారు. అయితే బస్రా గవర్నర్ అసద్ అల్ ఇదానీ మోటారుసైకిల్ పేలిందని విలేకరుల సమావేశంలో తెలిపారు. అనంతరం.. రెండు కార్లకు మంటలు వ్యాపించాయని పేర్కొన్నారు.
మోటార్‌సైకిల్‌కు బాంబు అమర్చారా? లేదా ఆత్మాహుతి దాడి జరిగిందా? అన్నది తెలియాల్సి ఉంది.
ఇదీ చూడండి: Latakia Port Attack: సిరియా నౌకాశ్రయంపై ఇజ్రాయెల్ క్షిపణి దాడి