ETV Bharat / international

Trump Arrest : 'గురువారం నన్ను అరెస్టు చేస్తారు.. అంతా బైడెన్‌ ఆధీనంలోనే!' - డొనాల్డ్​ ట్రంప్​ అమెరికా ఎన్నికలు

Trump Arrest Georgia Election Case : ఎన్నికల ముందు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​నకు అరెస్ట్​ భయం వెంటాడుతోంది. తనను గురువారం.. జార్జియాలో అరెస్ట్​ చేసే ప్రమాదం ఉందని ట్రంప్​ తెలిపారు. ఈ వ్యవహరమంతా బైడెన్‌ ఆధీనంలోని ఉన్న డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జస్టిస్‌ సమన్వయం చేస్తోందని ఆరోపించారు.

Trump Arrest Georgia Election Case
Trump Arrest Georgia Election Case
author img

By

Published : Aug 22, 2023, 12:31 PM IST

Trump Arrest Georgia Election Case : అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​నకు ఎన్నికల ముందు అరెస్ట్​ భయం పట్టుకుంది. జార్జియా ఎన్నికల ఫలితాల్లో జోక్యం చేసుకున్నట్లు దాఖలైన కేసులో ఇప్పటికే ట్రంప్‌ లొంగిపోవాల్సి ఉంది. గురువారం జార్జియా వెళ్లనున్న తనను.. అక్కడ రాడికల్‌ వామపక్ష డిస్ట్రిక్ట్‌ అటార్నీ ఫాని విల్లీస్‌ అరెస్టు చేసే ప్రమాదం ఉందని ట్రంప్‌ తన సొంత సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌ ట్రూత్‌లో పేర్కొన్నారు.

బైడెన్​ ఆధీనంలోనే..
Georgia Election Case : ఈ వ్యవహారాన్నంతా బైడెన్‌ ఆధీనంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జస్టిస్‌ సమన్వయం చేస్తోందని ఆరోపించారు. ఫాని విల్లీస్‌ దీనిని ప్రచారం చేసుకుని.. డబ్బు పోగుచేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఈ ఏడాది ట్రంప్‌ దాఖలైన నాలుగు క్రిమినల్‌ కేసుల్లో ఇదొకటి. గత కేసుల్లో కూడా ఆయన బెయిల్‌ పొందారు. ఇప్పటికే ట్రంప్‌పై చట్టపరంగా భారీగా ఆంక్షలున్నాయి.

'పూర్తిగా ఆ ఆరోపణలు అవాస్తవం'
Trump Indictment : ఇప్పటికే ట్రంప్​.. స్వయంగా ఫుల్టన్‌ కౌంటీ జైలుకు వెళ్లి లొంగిపోయి రెండు లక్షల డాలర్ల విలువైన బాండ్‌ను సమర్పించి బెయిల్‌ తీసుకొనేందుకు అట్లాంటా ఫుల్టన్‌ కౌంటీ డిస్ట్రిక్ట్‌ అటార్నీ ఫాని విల్లీస్‌ అనుమతించారు. ట్రంప్‌ ఈ బెయిల్‌ పొందాక సాక్షులను ప్రభావితం చేయనంతవరకు స్వేచ్ఛగా ఉండవచ్చు. ట్రంప్‌పై.. వ్యవస్థీకృతంగా పనిచేయడం, తప్పుడు ప్రకటనలు ఇవ్వడం వంటి 13 ఆరోపణలున్నాయి. ట్రంప్ మాత్రం ఈ ఆరోపణలు మొత్తం పూర్తిగా అవాస్తవాలని అంటున్నారు. పూర్తిగా రాజకీయ దురుద్దేశపూర్వకంగానే వీటిని చేపట్టినట్లు ఆరోపిస్తున్నారు.

'ఆ టీవీ చర్చకు వెళ్లను'
US President Elections : మరోవైపు, అధ్యక్ష ఎన్నికలో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్న వారితో బుధవారం ఫాక్స్‌ న్యూస్‌ నిర్వహించే టీవీ చర్చలో పాల్గొనబోనని ట్రంప్‌ ప్రకటించారు. రిపబ్లికన్‌ పార్టీ ఓటర్లుగా నమోదైనవారు, తమ పార్టీ తరఫున దేశాధ్యక్ష పదవికి అంతిమ అభ్యర్థి ఎవరో తేల్చడానికి ప్రైమరీ ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేయాలని ఆశిస్తున్నవారు టీవీ చర్చల్లో పాల్గొని ఎదుటివారి విధానాల కన్నా తమ విధానాలు ఎలా గొప్పవో వివరిస్తారు. రిపబ్లికన్‌ ఓటర్ల మనోగతం తెలిపే వివిధ సర్వేల్లో ట్రంప్‌ అందరి కన్నా ముందున్నట్లు తేలింది. ఆ తర్వాతి స్థానంలో వివేక్‌ రామస్వామి ఉన్నట్లు బలంగా ప్రచారం జరుగుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.