ETV Bharat / international

ఆ దేశ ప్రధానిని సస్పెండ్ చేసిన కోర్టు, కారణమిదే​ - థాయ్​లాండ్​ న్యూస్

Thailand prime minister suspended థాయ్​లాండ్​ ప్రధానమంత్రి ప్రయూత్​ చాన్​ వో చాను పదవి బాధ్యతల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ​ చేసింది రాజ్యాంగ కోర్టు. పదవీ కాలం ముగిసిన తర్వాత కూడా ప్రధానిగా కొనసాగుతున్నారని ప్రతిపక్షాలు పిటిషన్​ను దాఖలు చేశాయి. దీని​పై విచారించిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.

thailand prime minister suspended
thailand prime minister suspended
author img

By

Published : Aug 24, 2022, 4:45 PM IST

Thailand prime minister suspended: థాయ్​లాండ్​ రాజ్యాంగ కోర్టు బుధవారం కీలక ఆదేశాలు వెలువరించింది. ప్రధానమంత్రి ప్రయూత్​ చాన్​-వో-చాను పదవి బాధ్యతల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ​ చేసింది. ప్రధానమంత్రి ప్రయూత్​ తన పదవీ కాలం ముగిసిన తర్వాత కూడా కొనసాగుతున్నారంటూ ప్రతిపక్షాలు పిటిషన్​ను దాఖలు చేశాయి. దీని​పై విచారించిన న్యాయస్థానం.. వారి వాదనతో ఏకీభవించింది. కానీ పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారా? లేదా అనే ఆంశంపై ఎలాంటి స్పష్టత వచ్చే వరకు సస్పెన్షన్​ అమల్లో ఉంటుందని తెలిపింది. ఈ వ్యవహారంపై 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ప్రయూత్​ను ఆదేశించింది. కాగా ప్రస్తుతం ఆయన చేపడుతున్న రక్షణ శాఖను కొనసాగింపుపై ఎలాంటి స్పష్టతనివ్వలేదు. తాత్కాలిక ప్రధాని ఎవరు అనేది నిర్ణయించలేదు. రాజ్యాంగం ప్రకారం ఉపప్రధానమంత్రి ప్రవిత్​ వాంగ్​సువన్​ ప్రధాని బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

ప్రయూత్​ నాయకత్వంలోని సైనిక కూటమి 2014 మేలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే మంగళవారం నాటికే ప్రయూత్​ పదవీ కాలం ముగిసిందని.. అయినా పదవిలో కొనసాగుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రయూత్​ మద్దతుదారులు మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. సవరించిన రాజ్యాంగం ప్రకారం ప్రధానమంత్రి పదవీ కాలం 8 సంవత్సరాలని.. దీని ప్రకారం ఇది అమల్లోకి వచ్చిన 2017 ఏప్రిల్​ 6 నుంచి వర్తిస్తుందని చెపుతున్నారు. మరోవైపు కొత్త రాజ్యాగం ప్రకారం 2019 జూన్​ 9న ప్రయుత్​ బాధ్యతలు చేపట్టినందున.. నాటి నుంచే పదవీ కాలం మొదలవుతుందని కొందరు వాదిస్తున్నారు.

ఇవీ చదవండి: భారత్​, బ్రిటన్​ సంబంధాలపై రిషి సునాక్​ కీలక వ్యాఖ్యలు

రాజాసింగ్ వ్యాఖ్యలపై పాకిస్థాన్​ ఫైర్, మోదీకి స్పెషల్ డిమాండ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.