సోమాలియాలో మిలిటెంట్లు మళ్లీ రెచ్చిపోయారు. తీరప్రాంత నగరమైన కిస్మయోలో భీకర దాడికి తెగబడ్డారు. తొలుత పేలుడు పదార్థాలు నింపిన కారుతో హోటల్ గేటును ఢీకొట్టి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. అనంతరం కొందరు సాయుధులు హోటల్లోకి ప్రవేశించారు. ఈ దాడిలో తొమ్మిది మంది మృతి చెందినట్లు స్థానిక మీడియా పేర్కొంది. మృతుల్లో నలుగురు భద్రతా సిబ్బంది ఉన్నట్లు వెల్లడించింది. మరో 47 మంది గాయపడినట్లు తెలుస్తోంది.
ఈ దాడికి తమదే బాధ్యతని అల్-షబాబ్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. రాజధాని మొగదిషుకు 500 కిలో మీటర్ల దూరంలో కిస్మయో నగరంలో ఉన్న ఈ హోటల్లో ఎక్కువగా ప్రభుత్వ అధికారులు సమా వేశం అవుతుంటారు. అల్ ఖైదా ఉగ్రవాద సంస్థతో సన్నిహిత సంబంధాలు ఉన్న అల్ షబాబ్ ఉగ్రవాద సంస్థ సోమాలియాలో క్రమం తప్పకుండా విధ్వంసానికి పాల్పడుతోంది.
ఇవీ చదవండి: ఇంటిపై కూలిన యుద్ధ విమానం- ఇద్దరు పైలెట్లు మృతి
'ప్రధాని పదవికి పోటీ చేస్తున్నా'.. అధికారికంగా ప్రకటించిన రిషి సునాక్