ETV Bharat / international

550 మందికి తండ్రైన డాక్టర్.. ప్రపంచవ్యాప్తంగా సంతానం.. ఎలాగైనా ఆపే పనిలో ప్రభుత్వం! - నెదర్లాండ్స్ 500 మంది సంతానం

ఓ వైద్యుడు 550 మందికి తండ్రయ్యాడు. వీర్య దానం ద్వారా పెద్ద సంఖ్యలో సంతానాన్ని కన్నాడు. ఇప్పుడు అదే విషయంపై చిక్కుల్లో పడ్డాడు. అసలేమైందంటే?

sperm-donor-550-children
sperm-donor-550-children
author img

By

Published : Mar 28, 2023, 2:18 PM IST

నెదర్లాండ్స్​కు చెందిన ఓ వైద్యుడు వీర్యదానం ద్వారా 550 మందికి తండ్రి అయ్యాడు. ఇప్పుడు అదే ఆయనకు చిక్కులు తెచ్చిపెట్టింది. ఇకపై అతడు వీర్యదానం చేయకుండా అడ్డుకోవాలని పేర్కొంటూ ఓ మహిళ న్యాయపరమైన చర్యలకు దిగారు. ఫిర్యాదు చేసిన మహిళ సైతం ఆయన వీర్యాన్ని ఉపయోగించే బిడ్డకు జన్మనిచ్చారు. ఈ నేపథ్యంలోనే మరింత మంది చిన్నారులను కనకుండా ఆయన్ను నిరోధించాలని కోరుతూ డోనర్​కైండ్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి కేసు వేశారు.

ది హేగ్ నగరంలో నివసించే జొనథన్ ఎం(41) అనే వైద్యుడు.. ఇప్పటివరకు నెదర్లాండ్స్​తో పాటు ప్రపంచవ్యాప్తంగా 13 క్లినిక్​లలో వీర్యదానం చేశాడు. ఈ వీర్యం ద్వారా 550 మంది చిన్నారులు జన్మించారు. నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి 12 కుటుంబాలకు మాత్రమే వీర్యదానం చేయాలి. గరిష్ఠంగా 25 మంది చిన్నారులకు మాత్రమే జన్మనివ్వాలి. భవిష్యత్​లో రక్త సంబంధీకుల మధ్య లైంగిక సంబంధాలు తలెత్తకుండా చూడటం, పుట్టిన సంతానం మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిబంధనలు రూపొందించారు.

"ఆ వైద్యుడు వంద కంటే ఎక్కువ మందికి జన్మనిచ్చారని ముందే తెలిసి ఉంటే దాతగా అతడిని స్వీకరించేదాన్ని కాదు. వీర్యదానం వల్ల ఎక్కువ మందికి జన్మనివ్వడం వల్ల అనేక సమస్యలు ఉన్నాయి. వాటి పరిణామాలు తల్చుకుంటేనే నాకు భయం వేస్తోంది. నా బిడ్డ భవిష్యత్ గురించి ఆందోళన మొదలైంది. ఇంకా ఎంత మంది చిన్నారులు నా బిడ్డకు రక్త సంబంధీకులు అవుతారోననే ప్రశ్న తలెత్తింది. నా బిడ్డను రక్షించుకోవడానికి కోర్టుకు వెళ్లడమే మార్గం."
-వైద్యుడిపై కేసు వేసిన మహిళ

జొనథన్ వంద మందికి పైగా చిన్నారులకు వీర్యదానం ద్వారా జన్మనిచ్చాడని 2017లోనే తెలిసింది. దీంతో నెదర్లాండ్స్ యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది. ది డచ్ సొసైటీ ఆఫ్ అబ్ట్సెట్రిక్స్ అండ్ గైనకాలజీ (ఎన్​వీఓజీ) అతడిని బ్లాక్​లిస్ట్​లో చేర్చింది. జొనథన్ దానం చేసిన వీర్యాన్ని వినియోగించకూడదని అన్ని వీర్య బ్యాంకులకు విజ్ఞప్తి చేసింది. అయితే, వేటు పడ్డప్పటికీ జొనథన్ వెనక్కి తగ్గలేదని డోనర్​కైండ్ సంస్థ ఆరోపిస్తోంది. విదేశీయులకు తన వీర్యాన్ని దానం చేయడం ప్రారంభించాడని తెలిపింది. వీర్యం అవసరమైన మహిళలతో సోషల్ మీడియాలో పరిచయం పెంచుకున్నాడని... అక్రమ మార్గాల్లో వీర్యదానం చేశాడని వివరించింది. తాను ఎంత మందికి జన్మనిచ్చాననే విషయాన్ని వీర్య బ్యాంకులకు తెలియకుండా జాగ్రత్తపడ్డాడని పేర్కొంది.

"డోనర్ అన్ని నిబంధనలను ఉల్లంఘించారు. క్లినిక్​లతో చేసుకున్న ఒప్పందాలను బేఖాతరు చేశారు. ఎక్కువ మందికి జన్మనివ్వడానికే ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. దాత వ్యవహారం.. ఆయన వీర్యం ద్వారా జన్మించిన చిన్నారుల శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది."
-మార్క్ డి హెక్, డోనర్​కైండ్ ఫౌండేషన్ న్యాయవాది

జొనథన్ ప్రస్తుతం కెన్యాలో ఉన్నట్టు నెదర్లాండ్స్ మీడియా వెల్లడించింది. న్యాయ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.