ETV Bharat / international

ఆక్రమిత ఉక్రెయిన్​కు పుతిన్.. యుద్ధానికి ఇప్పట్లో ముగింపు లేనట్లే! - ఆక్రమిత ఉక్రెయిన్​లో పుతిన్ పర్యటన

రష్యా-ఉక్రెయిన్​ యుద్ధం కొనసాగుతున్న వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​ అనేక నెలల తర్వాత రెండోసారి రష్యా ఆక్రమిత ఉక్రెయిన్‌ ప్రాంతాల్లో పర్యటించారు. యుద్ధానికి సంబంధించిన తాజా పరిస్థితులను రష్యన్‌ ఉన్నత సైనికాధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు.

Russia President Putin Visited Ukraine Occupied Places
ఆక్రమిత ఉక్రెయిన్ ప్రాంతాల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్
author img

By

Published : Apr 18, 2023, 2:22 PM IST

Updated : Apr 18, 2023, 3:04 PM IST

ఉక్రెయిన్‌తో రష్యా దండయాత్రను ప్రారంభించి ఏడాదిపైనే గడుస్తున్నా యుద్ధానికి ముగింపు పలికేలా రష్యా వైఖరి కనిపించడం లేదు. తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ రష్యా ఆక్రమిత ఉక్రెయిన్‌ ప్రాంతాల్లో మంగళవారం పర్యటించారు. యుద్ధానికి సంబంధించిన తాజా పరిస్థితులను రష్యన్‌ ఉన్నత సైనికాధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ ఉదంతం యుద్ధం ఇప్పుడప్పుడే ముగిసేలా లేదనే సంకేతాలు ఇచ్చింది.

రష్యా ఆక్రమిత ఉక్రెయిన్‌లో రష్యన్‌ సైన్యం ప్రధాన కార్యాలయాన్ని ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సందర్శించారు. ఈ మేరకు రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ పుతిన్ పర్యటనకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. దక్షిణ ఖేర్సన్ ప్రాంతంలో రష్యా దళాల కమాండ్ పోస్ట్‌ను పుతిన్ సందర్శించారు. ఉన్నత సైనికాధికారులు యుద్ధానికి సంబంధించిన నివేదికలను పుతిన్‌కు వివరించారు. అనంతరం హెలికాప్టర్‌ ద్వారా లుహాన్స్క్‌ ప్రాంతంలోని రష్యన్ నేషనల్ గార్డ్ ప్రధాన కార్యాలయానికి వెళ్లి అక్కడి పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు.

గత ఏడాది సెప్టెంబరులో ఉక్రెయిన్‌లోని దొనెత్స్క్‌, జపోరిజ్జియా ప్రాంతాలతో పాటు ఖేర్సన్, లుహాన్‌స్క్‌ ప్రాంతాలను తమ దేశంలో విలీనం చేసుకున్నట్లు రష్యా ప్రకటించింది. ఈ చర్యను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. అయితే క్రెమ్లిన్ విడుదల చేసిన రష్యా అధ్యక్షుడి తాజా ఫుటేజీని స్వతంత్రంగా ధ్రువీకరించడం అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. రష్యా ఆక్రమిత ఉక్రెయిన్‌లో అనేక నెలల తర్వాత పుతిన్‌ రెండవ సారి పర్యటించారు.

Russia President Putin Visited Ukraine Occupied Places
ఆక్రమిత ఉక్రెయిన్ ప్రాంతాల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంపై భారత్​ వైఖరి..
రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం మొదలై ఫిబ్రవరి 24కి ఏడాది పూర్తయినా ఇప్పట్లో ఈ మంటలు చల్లారేలా కనిపించటం లేదు. ఈ విషయంలో ఇరు దేశాలు వెనక్కి తగ్గకపోగా.. పరస్పరం దాడులకు దిగుతున్నాయి. ఈ యుద్ధానికి పలు దేశాలు మద్దతు పలుకుతుంటే.. మరికొన్ని దేశాలు తటస్థ వైఖరిని ప్రదర్శిస్తున్నాయి. ఇందులో భారత్​ ఒకటి. ఇందుకు ప్రధాన కారణం రష్యాతో మనకున్న సత్సంబంధాలే. దశాబ్దాలుగా రష్యాతో మంచి మైత్రిబంధాన్ని కొనసాగిస్తోంది మన దేశం. ఉక్రెయిన్​తో కూడా స్నేహపూర్వకంగా కూడా ఉంటోంది భారత్​. ఈ నేపథ్యంలో ఏ ఒక్కరికి మద్దతు తెలపకుండా శాంతియుత చర్చలతోనే యుద్ధానికి ముగింపు పలకాలని ఇరుదేశాల అధినేతలతో పలుమార్లు చర్చలు కూడా జరిపారు ప్రధాని నరేంద్ర మోదీ. మరోవైపు పలు ఐరోపా దేశాలు ఉక్రెయిన్​కు మద్దతుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా యుద్ధం మొదలైన నాటి నుంచి ఉక్రెయిన్‌కు పోర్చుగల్ అండగా నిలిచింది.

ఐక్యరాజ్య సమితి తీర్మానం..
రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి ఏడాది గడిచిన నేపథ్యంలో దానికి ముగింపు పలకాలని.. వెంటనే రష్యా బలగాలు అక్కడి నుంచి వైదొలగాలని డిమాండ్‌ చేస్తూ ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ తీర్మానం ఆమోదించింది. 193 సభ్యదేశాలు ఉన్న జనరల్‌ అసెంబ్లీలో.. 141 దేశాలు తీర్మానానికి అనుకూలంగా.. మరో 7 దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి. ఈ ప్రక్రియలో భారత్‌, చైనా సహా మరో 30 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ఈ యుద్ధం విషయంలో బాధ్యుడిని, బాధితుడిని సమానంగా చూడలేమని.. ఐరోపా సమాఖ్య విదేశాంగ శాఖ చీఫ్‌ జోసెఫ్‌ బోరెల్‌ తెలిపారు.

Last Updated : Apr 18, 2023, 3:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.