Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్‌తో ఇరాన్‌లో జరిగిన సమావేశానికి ముందు ఒంటరిగా కొద్దిసేపు ఎదురుచూడాల్సి వచ్చింది. మామూలుగా ఆయనే తనను కలవడానికి వచ్చిన నేతలను కొన్ని గంటల పాటు వేచి చూసేలా చేస్తుంటారు. ఇప్పుడు రివర్స్‌లో ఆయనే ఎర్డోగన్ కోసం వేచిచూశారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది.
-
... pic.twitter.com/oyTubLlJtA
— Christo Grozev (@christogrozev) July 19, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">... pic.twitter.com/oyTubLlJtA
— Christo Grozev (@christogrozev) July 19, 2022... pic.twitter.com/oyTubLlJtA
— Christo Grozev (@christogrozev) July 19, 2022
ఇరాన్‌లో జరిగిన సమావేశంలో భాగంగా ఒక గదిలోకి ప్రవేశించిన పుతిన్‌ను పలకరించడానికి కనీసం ఒక్కరు కూడా లేరు. దాంతో ఆయన కుర్చీల ముందు 50 సెకన్ల పాటు ఒంటరిగా వేచిచూడాల్సి వచ్చింది. రెండు చేతులు దగ్గరగా పెట్టి, మూతిని కదిలిస్తూ ఎదురుచూశారు. ఈ తర్వాత ఎర్డోగన్ రావడంతో తన చేతులు చాచి పలకరింపుగా మాట్లాడారు. తర్వాత వారిద్దరు ఉక్రెయిన్ నుంచి ధాన్యం ఎగుమతి గురించి చర్చలు జరిపారు. కాగా, దీనిపై టర్కీ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2020లో ఎర్డోగన్‌కు జరిగినదానికి ఇది ప్రతీకారమన్నట్లు వార్తలు వచ్చాయి. ఆ సమయంలో మాస్కోలో పుతిన్‌తో సమావేశం అయ్యేందుకు ఆయన రెండు నిమిషాల పాటు వేచి చూడాల్సి వచ్చింది. కాగా, ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పుతిన్ పరిస్థితి ఎంతమారిపోయిందని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి: సవాళ్ల లంకకు సారథిగా రణిల్.. ద్వీపదేశం గట్టెక్కేనా?