PM Denamrk Visit: ఉక్రెయిన్‌లో తక్షణం కాల్పుల విరమణ పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. రెండు దేశాలు వెంటనే చర్చల మార్గంలోకి రావాలని కోరారు. డెన్మార్క్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని మెట్టె ఫ్రెడెరిక్సన్‌తో కలిసి ద్వైపాక్షిక సంబంధాలపై మోదీ చర్చించారు. గ్రీన్ స్ట్రాటజిక్ భాగస్వామ్యం, నైపుణ్యాభివృద్ధి, వాతావరణ మార్పులు, పునరుత్పాదక ఇంధనం తదితర అంశాలపై సమాలోచనలు చేశారు.
Modi Meeting with Danish PM: ఈ సమావేశంలో పలు అంశాలపై రెండు దేశాలు అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అనంతరం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడిన మోదీ.. ఇండియా-ఈయూ స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందంపై చర్చలు త్వరలోనే ముగిసే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్ కోసం సంయుక్త కార్యాచరణపై సమీక్షించినట్లు తెలిపారు. తమ భేటీలో ఉక్రెయిన్ అంశం సైతం ప్రస్తావనకు వచ్చిందన్న మోదీ... వెంటనే ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ పాటించాలని విజ్ఞప్తి చేశారు. దౌత్యం ద్వారా మాత్రమే వివాదాన్ని పరిష్కరించుకోగలమని సూచించారు. అటు భారత తన పలుకుబడిని ఉపయోగించి యుద్ధాన్ని, మరణాలను ఆపేలా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఒప్పించాలని డెన్మార్క్ ప్రధాని ఫ్రెడెరిక్సన్ కోరారు.
Modi Europe Tour: అంతకుముందు మూడు రోజుల ఐరోపా పర్యటనలో భాగంగా.. రెండో రోజు డెన్మార్క్ చేరుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కొపెన్హాగెన్ విమానాశ్రయంలో ఆయనకు డానిష్ ప్రధాని మెట్టె ఫ్రెడెరిక్సెన్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇరు దేశాధినేతలు ఆమె నివాసానికి వెళ్లారు. అక్కడే ఫ్రెడెరిక్సెన్తో మోదీ ప్రత్యేకంగా మాటామంతీలో పాల్గొన్నారు. ఈ భేటీ అనంతరం రెండో ఇండియా-నోర్డిక్ సమావేశంలో మోదీ పాల్గొన్నారు.
Modi News: మోదీ డెన్మార్క్ బయల్దేరానికి ముందు జర్మనీ బెర్లిన్ విమానాశ్రయంలో ప్రవాస భారతీయులతో ముచ్చటించారు. ఓ చిన్నారితో కాసేపు సరదాగా గడిపారు. ఆమెతో ఆటలాడారు. ఆప్యాయంగా పలకరించారు. మోదీని చూసి అక్కడున్న వారంతా సంతోషం వ్యక్తం చేశారు. మోదీ ఐరోపా పర్యటన సోమవారం ప్రారంభమైంది. బుధవారంతో ముగుస్తుంది. ఈ టూర్లో భాగంగా పలు ఐరోపా దేశాలతో ద్వైపాక్షిక సమావేశాల్లో మోదీ పాల్గొంటున్నారు.
-
#WATCH | Prime Minister Narendra Modi shared a light moment with a child in Berlin, Germany earlier today pic.twitter.com/C4dH9S8CQB
— ANI (@ANI) May 3, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Prime Minister Narendra Modi shared a light moment with a child in Berlin, Germany earlier today pic.twitter.com/C4dH9S8CQB
— ANI (@ANI) May 3, 2022#WATCH | Prime Minister Narendra Modi shared a light moment with a child in Berlin, Germany earlier today pic.twitter.com/C4dH9S8CQB
— ANI (@ANI) May 3, 2022
ఇదీ చదవండి: '3 దశాబ్దాల రాజకీయ అస్థిరతను భారత్ ముగించింది'