ETV Bharat / international

ల్యాప్​టాప్​ లేక ప్రధాని ప్రోగ్రామ్​ లైవ్​ ఇవ్వలేకపోయారట! - ల్యాప్​టాప్​ లేక పీఎం ప్రోగ్రామ్​ ఇవ్వలేకపోయిన టీవీ

PM program live: ల్యాప్​టాప్​ అందుబాటులో లేకపోవటం వల్ల ప్రధానమంత్రి కార్యక్రమానికి సరైన కవరేజీ అందించలేకపోయింది పాకిస్థాన్​ ప్రభుత్వ ఆధ్వర్యంలోని టెలివిజన్​ ఛానల్​. ఏప్రిల్​ 24న లాహోర్​లోని కోట్​ లఖ్​పత్​ జైలు, రంజాన్​ బజార్​ను ప్రధాని షరీఫ్​ సందర్శించిన క్రమంలో​ కవరేజీ చేయలేకపోయినట్లు ఓ వార్తాసంస్థ తెలిపింది.

Pak TV
పాకిస్థాన్​ టీవీ
author img

By

Published : May 2, 2022, 2:03 PM IST

PM program live: పాకిస్థాన్‌ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ లాహోర్ పర్యటనకు సరైన కవరేజీ ఇవ్వడంలో విఫలమైనందుకుగానూ ప్రభుత్వ ఆధ్వర్యంలోని పాకిస్థాన్ టెలివిజన్(పీటీవీ).. 17 మంది ఉద్యోగులను సస్పెండ్ చేసింది. కొత్తగా ఎన్నికైన ప్రధాని షరీఫ్‌ ఏప్రిల్‌ 24న లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్ జైలు, రంజాన్ బజార్‌లను సందర్శించారు. అయితే, ఫైల్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్(ఎఫ్‌టీపీ) ద్వారా సంబంధిత వీడియో ఫుటేజీని అప్‌లోడ్ చేయడానికి అవసరమైన అధునాతన ల్యాప్‌టాప్ అందుబాటులో లేనందున.. పీటీవీ బృందం సరైన కవరేజీని అందించలేకపోయిందని ఓ వార్తాసంస్థ పేర్కొంది. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ప్రకారం.. రిపోర్టర్‌లు, ప్రొడ్యూసర్‌లతో కూడిన బృందం ప్రధానమంత్రి కవరేజీకి బాధ్యత వహిస్తుంది. లైవ్ స్ట్రీమింగ్, సకాలంలో వీడియో ఫుటేజీల అప్‌లోడ్‌ కోసం వారి వద్ద ల్యాప్‌టాప్‌లు, ఇతర గాడ్జెట్‌లు ఉంటాయి. కానీ, పీటీవీ లాహోర్‌ కేంద్రంలోని సిబ్బంది వద్ద అధునాతన ల్యాప్‌టాప్‌ లేకపోయింది.

పీఎం పర్యటన నేపథ్యంలో.. తమకు ల్యాప్‌టాప్ కావాలని అక్కడి సిబ్బంది ఛానెల్‌ ప్రధాన కార్యాలయాన్ని కోరారు. అంతకుముందు ఏప్రిల్ 18న కూడా ఈ మేరకు ఓ లేఖ రాశారు. 'లాహోర్ కేంద్రంలో ల్యాప్‌టాప్ ఎడిటింగ్ సదుపాయం లేదు. కాబట్టి, ఓదాన్ని అద్దెకు తీసుకున్నాం. కానీ, సొంత ల్యాప్‌టాప్‌ అత్యవసరం' అని అందులో పేర్కొన్నారు. అయినా.. యాజమాన్యం పట్టించుకోలేదు. పైగా, మరోసారి అద్దెకు తీసుకోవాలని సూచించింది. దీంతో వారు.. ఓ అధికారి వ్యక్తిగత ల్యాప్‌టాప్‌ తీసుకున్నారు. ప్రధాని కార్యక్రమం కవరేజ్ తర్వాత ఫుటేజీని ఎఫ్‌టీపీ ద్వారా కార్యాలయానికి పంపించేందుకు యత్నించగా.. దాంట్లో బ్యాటరీ అయిపోయింది. ఫలితంగా పీటీవీ స్పాట్‌ దృశ్యాలను ప్రసారం చేయలేకపోయింది. దీంతో.. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన యాజమాన్యం.. వీవీఐపీ కవరేజ్ డిప్యూటీ కంట్రోలర్ ఇమ్రాన్ బషీర్ ఖాన్‌సహా మొత్తం 17 మంది ఉద్యోగులను సస్పెండ్ చేసింది. ఇంజినీర్లు, కెమెరామెన్లనూ తొలగించింది. అయితే, కొంతమందిని కాపాడేందుకే తమను బలిపశువులను చేశారని సస్పెన్షన్‌కు గురైన ఉద్యోగులు ఆరోపించారు.

ఇదీ చూడండి: ప్రధాని, రక్షణ మంత్రి సెల్​ఫోన్స్ హ్యాక్- ఆ దేశంలో కలకలం

అమెరికా నిఘా సంస్థ తొలి సీటీఓగా భారత సంతతి వ్యక్తి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.