ETV Bharat / international

పాక్ మసీదులో మానవ బాంబు.. 61 మంది మృతి.. 150 మందికి గాయాలు - పాకిస్థాన్​లో మానవ బాంబు

పాకిస్థాన్‌ పెషావర్ ప్రాంతంలోని ఓ మసీదులో ఆత్మాహుతి బాంబు దాడికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఈ పేలుడు ఘటనలో 61 మంది మృతి చెందగా.. 150 మందికి పైగా తీవ్ర గాయాలయినట్లు అధికారులు వెల్లడించారు.

Bomb Blast In Pakistan Mosque
మసీదులో ఆత్మాహుతి దాడి
author img

By

Published : Jan 30, 2023, 2:49 PM IST

Updated : Jan 30, 2023, 10:56 PM IST

పాకిస్థాన్‌ పెషావర్​లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలోని ఓ మసీదులో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడగా 61 మంది మరణించారు. ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తి మసీదులో ప్రార్థనలు నిర్వహిస్తున్న సమయంలో ముందు వరుసలో కుర్చున్నాడని.. మధ్యాహ్నం 1.40 నిమిషాల సమయంలో తనను తాను పేల్చుకున్నాడని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 61 మంది చనిపోగా.. సుమారు 150 మందికి పైగా గాయపడ్డారని తెలిపారు. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను పెషావర్‌లోని లేడీ రీడింగ్ ఆసుపత్రికి తరలించామని చెప్పారు. వీరిలో పలువురి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని.. ప్రాణనష్టం మరింత పెరిగే అవకాశం ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అయితే క్షతగాత్రుల్లో ఎక్కువగా పోలీసులే ఉన్నారని ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పారు.

తెహ్రీక్-ఇ-తాలిబన్ (టీటీపీ) ఈ దాడికి తెగబడ్డట్లు తెలుస్తోంది. గతేడాది ఆగస్టులో హతమైన తన సోదరుడి మృతికి ప్రతీకారంగా తాజా దాడి చేసినట్లు టీటీపీ కమాండర్ ఉమర్ ఖలీద్ ఖురసాని తెలిపాడు. పేలుడు జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో 300 నుంచి 400 మంది పోలీసు అధికారులు ఉన్నారని ఉన్నతాధికారులు వెల్లడించారు. అక్కడ భద్రతా వైఫల్యం జరిగినట్లు స్పష్టంగా తెలుస్తోందని పేర్కొన్నారు.

దాడిలో మసీదులో కొంత భాగం ధ్వంసమైందని పోలీసులు వెల్లడించారు. శిథిలాల కింద అనేక మంది ఉన్నారని భావిస్తున్నట్లు తెలిపారు. నాలుగు వరుసల భద్రతా వలయాన్ని దాటుకొని ఉగ్రవాది.. మసీదులోకి చొరబడ్డాడని చెప్పారు. ఆత్మాహుతి దాడి నేపథ్యంలో పెషావర్‌లోని ఆసుపత్రుల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. బాధితుల కోసం రక్తదానం చేయాలని ఆసుపత్రి వర్గాలు పౌరులకు విజ్ఞప్తి చేశాయి. మసీదు పరిసర ప్రాంతంలో అత్యవసర పరిస్థితిని విధించి భారీగా పోలీసు బలగాలను మోహరించారు.

పాక్ ప్రధాని స్పందన
ఈ దాడిని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్రంగా ఖండించారు. దేశం మొత్తం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడుతోందని చెప్పారు. ఈ దాడితో ఇస్లాంకు సంబంధం లేదని అన్నారు. 'పాకిస్థాన్​ను రక్షించే బాధ్యతల్లో ఉన్న వారిని ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. ప్రజల్లో భయోత్పాతం సృష్టించాలని అనుకుంటున్నారు. దాడిలో మరణించినవారి త్యాగాలు వృథా కావు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు సమగ్ర వ్యూహాన్ని అమలు చేస్తాం' అని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు.

Last Updated : Jan 30, 2023, 10:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.