ETV Bharat / international

భారత్​ పర్యటన సక్సెస్​.. ఆ అపోహను బద్దలు కొట్టేందుకు ప్రయత్నించా: భుట్టో - బిలావల్‌ భుట్టో వార్తలు

భారత్​ పర్యటన విజయవంతమైందని పాకిస్థాన్​ విదేశాంగ మంత్రి బిలావల్‌ భుట్ తెలిపారు. భారత గడ్డపై తమ దేశ వాదనను వినిపించామన్న ఆయన.. తమపై ఉన్న అపోహను తొలిగించే ప్రయత్నం చేశామని చెప్పారు.

Pakistan Foreign Minister Bilawal Bhutto Zardari terms his visit to India a success

author img

By

Published : May 6, 2023, 7:30 AM IST

SCO Summit 2023 Goa Bilawal Bhutto : షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సదస్సులో పాల్గొనడానికి భారత్​ వచ్చిన పాకిస్థాన్​ విదేశాంగ మంత్రి బిలావల్‌ భుట్టో జర్దారీ తన పర్యటన విజయవంతమైందని తెలిపారు. భారత గడ్డపై తమ దేశ వాదనను వినిపించామని చెప్పారు. గోవాలో జరిగిన ఎస్​సీవో సదస్సులో పాల్గొన్న ఆయన.. శుక్రవారం తిరిగి పాకిస్థాన్​ చేరుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

ప్రతీ ముస్లిం ఉగ్రవాది అనే అపోహను బద్దలు కొట్టే ప్రయత్నం చేశానని భుట్టో చెప్పారు. కశ్మీర్‌లో 2019 ఆగస్టు 5కు ముందు ఉన్న స్థితిని పునరుద్ధరించడం కోసం చర్చలకు అనుకూలమైన వాతావరణాన్ని భారత్ సృష్టించాలని ఆయన స్పష్టం చేశారు. చైనా-పాక్​ ఎకనామిక్ కారిడార్‌లో భాగం కావాలని.. ఆసియా దేశాలు ఎదురు చూస్తున్నాయని ఆయన చెప్పారు. భారతదేశం మినహా ప్రతి దేశం సీపీఈసీకి మద్దతునిచ్చిందని ఆయన తెలిపారు.

జైశంకర్​ ఘాటు వ్యాఖ్యలు
అయితే షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సదస్సుకు పాక్‌ విదేశాంగమంత్రి బిలావల్‌ భుట్టో జర్దారీ భారత్‌ వచ్చిన సందర్భంలోనే భారత విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ శుక్రవారం ఘాటు విమర్శలు చేశారు. ఉగ్రవాద పరిశ్రమకు పాకిస్థాన్‌ అధికార ప్రతినిధి అని.. అలాంటి దేశంతో చర్చల ప్రసక్తే లేదని జైశంకర్‌ కుండబద్ధలు కొట్టారు. ఉగ్ర పరిశ్రమను ప్రేరేపించే, సమర్థించే అధికార ప్రతినిధిగా పాక్‌ను జైశంకర్‌ అభివర్ణించారు. "ఉగ్రవాద బాధితులు.. ఉగ్రవాదులతో మాట్లాడరు. బాధితులు తమను తాము రక్షించుకుంటారు. ఎదుర్కొంటారు. ఇప్పుడు మేం అదే పనిచేస్తున్నాం" అని తెలిపారు.

370 ముగిసిన చరిత్ర
పాక్‌ విశ్వసనీయత.. వారి విదేశీ నిల్వల కంటే వేగంగా దిగజారిపోతోందని సదస్సు అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. ఎస్సీవో సదస్సుకు వచ్చిన బిలావల్‌ను తాము ఓ సభ్యత్వ దేశ మంత్రిగానే చూస్తున్నామని.. అంతకుమించి ఆయన పర్యటనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని తెలిపారు. 370 ముగిసిన చరిత్ర అని.. ఆ విషయాన్ని పాక్‌ ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిదని పేర్కొన్నారు. డ్రాగన్‌తో సంబంధాలు సాధారణంగా లేవని ఆయన అంగీకరించారు. సరిహద్దుల్లో ఉపసంహరణ ప్రక్రియ ముందుకు వెళితేనే, శాంతి నెలకొంటుందని.. అంతవరకు పరిస్థితులు మెరుగుపడవని స్పష్టం చేశారు. అయితే ఎస్సీవో సదస్సులో పాల్గొనడానికి వచ్చిన చైనా విదేశాంగమంత్రి చిన్‌ గాంగ్‌ మాత్రం సరిహద్దుల్లో పరిస్థితులు స్థిరంగా ఉన్నాయని పేర్కొనడం గమనార్హం.

ఆర్థిక మూలాలను తుంచేయాల్సిందే
అంతకుముందు భారత్‌ అధ్యక్షతన జరిగిన ఎస్సీవో విదేశాంగమంత్రుల సదస్సులోనూ జైశంకర్‌ ప్రసంగించారు. ఈ సమావేశానికి మన దేశం ఆతిథ్యమివ్వడం ఇదే తొలిసారి. సదస్సులో రష్యా, చైనా, పాక్‌ విదేశాంగ మంత్రులు సెర్గీ లవ్రోవ్‌, చిన్‌గాంగ్‌, బిలావల్‌ భుట్టో జర్దారీ సహా సభ్యదేశాల మంత్రులంతా పాల్గొన్నారు. జైశంకర్‌ తన ప్రసంగంలో ఉగ్రవాదం అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. పాక్‌ పేరు తీయకుండానే ఆ దేశంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తీవ్రవాదాన్ని ఏ రూపంలో ఉన్నా సమర్థించకూడదని.. సీమాంతర ఉగ్రవాదం.. పెనుముప్పు అని పేర్కొన్నారు. ఉగ్రవాద ఆర్థిక మూలాలను తుంచేయాలని ఎస్సీవో దేశాలకు పిలుపునిచ్చారు.

మేమూ బాధితులమే
తమ దేశం కూడా ఉగ్రవాదానికి బలైందని బిలావల్ భుట్టో ఎస్సీవో సదస్సులో పేర్కొన్నారు. వ్యక్తిగతంగా తానూ బాధితుడినేని, తన తల్లి బేనజీర్‌ భుట్టో కూడా ముష్కరుల చేతుల్లో హతమయ్యారని తెలిపారు. అయితే.. ఉగ్రవాదాన్ని దౌత్య సంబంధాల్లో ఆయుధంగా వినియోగించకూడదంటూ పరోక్షంగా భారత్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పాక్‌ విదేశాంగమంత్రి భారత్‌లో పర్యటించడం 12 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.