పోషకాహార లోపం కోరల్లోంచి భారత్ క్రమంగా బయటపడుతున్నట్లు కనిపిస్తోంది! గత 15 ఏళ్లలో దేశంలో పోషకాహార లోపం బాధితుల సంఖ్య గణనీయంగా తగ్గిందని ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. 2004-06 మధ్య దేశ జనాభాలో వారు 21.6% ఉండగా.. 2019-21 నాటికి 16.3 శాతానికి దిగి వచ్చిందని తెలిపింది. అయితే గతంతో పోలిస్తే భారతావనిలో ఊబకాయ వయోజనులు, రక్తహీనతతో బాధపడుతున్న మహిళల సంఖ్య పెరిగినట్లు పేర్కొంది.
'ప్రపంచంలో ఆహార భద్రత, పోషకాహార స్థితి-2022' పేరుతో ఐరాస పరిధిలోని ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏవో), అంతర్జాతీయ వ్యవసాయాభివృద్ధి నిధి (ఐఎఫ్‌ఏడీ), యునిసెఫ్, ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యూఎఫ్‌పీ), ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఉమ్మడిగా ఈ నివేదికను విడుదల చేశాయి. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రత, ఊబకాయుల సంఖ్య, పోషకాహార లేమి సమస్య వంటి అంశాల గురించి అందులో పలు కీలక అంశాలు తెలియజేశారు. తాజా నివేదిక ప్రకారం..
ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ఆకలికేకలు
ప్రపంచవ్యాప్తంగా ఆకలితో అలమటిస్తున్నవారి సంఖ్య 2021లో 82.8 కోట్లకు పెరిగింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 4.6 కోట్ల మేర అధికం. కొవిడ్ మహమ్మారి ప్రారంభమయ్యాక మొత్తంగా ఈ జాబితాలో 15 కోట్ల మంది అదనంగా చేరడం గమనార్హం.
ఇవీ చదవండి: అప్పుడు 'వన్ మ్యాన్ షో'తో అఖండ విజయం.. ఇప్పుడు అతివిశ్వాసంతో రాజకీయ పతనం!
బ్రిటన్ రాజకీయాన్ని మార్చేసిన 'మూర్తి గారి అల్లుడు'.. ప్రధాని రేసులో ముందంజ!