ETV Bharat / international

'అణ్వాయుధాలు పెంచుకునే పనిలో భారత్​.. వారితో పోలిస్తే తక్కువే'

శత్రువుల నుంచి పొంచి ఉన్న ముప్పును సమర్థంగా ఎదుర్కోవాలంటే దేశాల ఆయుధ వ్యవస్థ పటిష్ఠంగా ఉండాలి. ఒకవేళ యుద్ధం చేయాల్సి వస్తే ఆధునిక ఆయుధాలతో అమ్ములపొది నిండుగా ఉండాల్సిందే. అప్పుడే విజయం సాధ్యం. ఏ దేశం దగ్గరైనా అణ్వాయుధాలు ఉంటే ఆ దేశం జోలికి వెళ్లేందుకు ప్రత్యర్థి దేశాలు వెనకంజ వేస్తాయి. ఈ నేపథ్యంలో భారత్‌ తమ వద్ద ఉన్న అణ్వాయుధాలను పెంచుకుంటోందని స్వీడన్‌కు చెందిన సంస్థ సిప్రీ వెల్లడించింది.

nuclear warheads
అణ్వాయుధాలు పెంచుకునే పనిలో భారత్​.
author img

By

Published : Jun 13, 2022, 6:39 PM IST

మారుతున్న పరిస్థితులు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతకు అనుగుణంగా ప్రపంచ దేశాలు తమ యుద్ధ రీతులను మార్చుకుంటున్నాయి. శత్రుదేశాల కంటే పైచేయి సాధించే క్రమంలో తమ ఆయుధాగారాలను పటిష్ఠం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో యుద్ధంలో కీలకంగా భావించే అణ్వాయుధాలపై ఎప్పుడో కన్నేసిన పలు దేశాలు వాటిని తమ ఆయుధాగారంలో భద్రంగా ఉంచాయి. ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా లాంటి అగ్రదేశాలు సహా భారత్‌, ఇజ్రాయెల్‌, చైనా, పాకిస్థాన్‌ వంటి 9 దేశాల వద్ద మాత్రమే అణ్వాయుధాలు ఉన్నాయి. అయితే భారత్‌ సహా వివిధ దేశాల వద్ద ఉన్న అణ్వాయుధాల గురించి స్వీడన్‌ రక్షణ మేథో సంస్థ సిప్రీ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

పాక్​లోనే ఎక్కువ: 2022 జనవరి నాటికి భారత్‌ వద్ద 160 అణు వార్‌హెడ్‌లు ఉన్నాయని సిప్రీ తెలిపింది. భారత్‌ ఈ సంఖ్యను మరింత పెంచుకుంటున్నట్లు కనిపిస్తోందని వెల్లడించింది. భారత్ వద్ద 2021 జనవరిలో 156 వార్‌హెడ్‌లు ఉండగా, ఏడాది వ్యవధిలో ఆ సంఖ్య 160కి పెరిగిందని సిప్రీ తెలిపింది. భారత్‌ను తరచూ అస్థిరపరిచే యత్నాల్లో ఉండే పాకిస్థాన్‌ వద్ద భారత్‌ కంటే ఎక్కువగా అణ్వాయుధాలు ఉన్నాయని వెల్లడించింది. 2021 జనవరి నుంచి 2022 జనవరి వరకు పాక్‌ తన అణ్వాయుధ వార్‌హెడ్‌ల సంఖ్యను పెంచుకోకున్నా.. ఆ దేశం వద్ద భారత్‌ కంటే అధిక సంఖ్యలో 165 అణ్వాయుధాలు ఉన్నట్లు తెలిపింది. పాక్‌ కూడా తమ అణ్వాయుధాలను పెంచుకునే పనిలో ఉందని సిప్రీ వెల్లడించింది.

చైనా వద్ద రెట్టింపు: భారత్‌పై కుట్రలు పన్నే మరో దేశం చైనా వద్ద భారత్‌ కంటే రెట్టింపు సంఖ్యలో అణ్వాయుధాలు ఉన్నట్లు సిప్రీ తెలిపింది. 2022 జనవరి నాటికి చైనా 350 అణ్వాయుధాలను కలిగి ఉందని వివరించింది. ఏడాది క్రితంతో పోలిస్తే ఈ సంఖ్య అలాగే ఉన్నా చైనా తమ అణ్వాయుధాలను విస్తరించుకునే పనిలో ఉందని తెలిపింది. ఉపగ్రహ చిత్రాలను పరిశీలిస్తే చైనా తమ అణ్వాయుధాలను నిల్వ చేసేందుకు 300 నిర్మాణాలను చేపట్టినట్లు కనిపిస్తోందని సిప్రీ వెల్లడించింది.

ఇదీ చూడండి: భారత్, చైనా, పాక్.. అణ్వాయుధాల జోరు!

అణ్వాయుధాగారానికి చైనా పదును- అదే దారిలో అమెరికా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.